తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో యంగ్​ ఇండియా స్పోర్ట్స్​ యూనివర్సిటీ - ఆనంద్​ మహీంద్రాకు మరో కీలక విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్ - Sports University In Telangana - SPORTS UNIVERSITY IN TELANGANA

Sports University in Telangana : రాష్ట్రంలో స్పోర్ట్స్​ యూనివర్సిటీ ఏర్పాటు దిశగా సీఎం రేవంత్ రెడ్డి సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ విశ్వవిద్యాలయంలో స్పోర్ట్స్​ సైన్స్, స్పోర్ట్స్​ మెడిసిన్​ లాంటి సుమారు 12కు పైగా క్రీడా కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక రచన చేస్తోంది. మరోవైపు ఒలింపిక్స్​లో సత్తా చాటేలా క్రీడా సదుపాయాలు మెరుగుపరిచేందుకు సహకరించాలని ఆనంద్​ మహీంద్రాను రేవంత్ రెడ్డి కోరారు.

TG Govt To Set Up Sports University
TG Govt To Set Up Sports University (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 18, 2024, 8:53 AM IST

Updated : Aug 18, 2024, 10:42 AM IST

TG Govt To Set Up Sports University :తెలంగాణలో భవిష్యత్‌ ఒలింపిక్‌ ఛాంపియన్లను సిద్ధం చేసేందుకు ‘యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఫ్యూచర్‌ సిటీ(ఫోర్త్‌ సిటీ)లోని స్పోర్ట్స్‌ హబ్‌లో దీన్ని ఏర్పాటుచేయనున్నారు. దాదాపు 200 ఎకరాల్లో స్థాపించనున్న ఈ విశ్వవిద్యాలయంలో డజనుకుపైగా స్పోర్ట్స్‌ అకాడమీలు రానున్నాయి. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతోపాటు స్పోర్ట్స్‌ సైన్స్, మెడిసిన్‌ సెంటర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

కొరియన్ క్రీడా వర్సిటీ సాంకేతిక భాగస్వామిగా :క్రీడా​ యూనివర్సిటీకి అనువైన స్థలం కోసం హకీంపేటలోని స్పోర్ట్స్‌ స్కూల్, గచ్చిబౌలిలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లను పరిశీలిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం దక్షిణకొరియా పర్యటనకు వెళ్లినప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి సియోల్‌లోని కొరియన్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. 1976లో ప్రారంభించిన ఈ వర్సిటీ ప్రపంచంలోనే ప్రఖ్యాత స్పోర్ట్స్​ వర్సిటీగా నిలిచింది.

ఇటీవల పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో దక్షిణకొరియా 32 పతకాలు సాధించగా వాటిలో 16 పతకాలు కొరియన్‌ క్రీడావర్సిటీ క్రీడాకారులే సాధించారు. తన పర్యటన సందర్భంగా రేవంత్‌రెడ్డి ఆర్చరీలో మూడు బంగారు పతకాలు సాధించిన యూనివర్సిటీ అథ్లెట్‌ లిమ్‌ సి-హైయోన్‌ను అభినందించారు. యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ వర్సిటీకి కొరియన్‌ క్రీడా వర్సిటీ సాంకేతిక భాగస్వామిగా వ్యవహరించనున్నట్లు సమాచారం.

మహీంద్రాజీ సూచనలు సలహాలు అందించండి :లాస్‌ఏంజెలిస్‌లో 2028లో జరగనున్న ఒలింపిక్స్‌లో మన దేశ పనితీరు మెరుగుపరిచేందుకు, తెలంగాణలో స్థాపించనున్న యంగ్‌ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీలో ఉండాల్సిన మౌలిక వసతులపై సూచనలు, సహాయ సహకారాలు అందించాలని మహీంద్రా గ్రూపు సంస్థల ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రను సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ‘‘'దేశానికి ఒలింపిక్స్‌ పతకాలు తెచ్చిన క్రీడాకారులను అభినందిస్తున్నా. కానీ, దేశాల వారీగా ర్యాంకులను చూసినప్పుడు కొంత బాధ కలుగుతోంది.

క్రీడలపై ప్రభుత్వం డబ్బు ఖర్చు చేసింది. ప్రోత్సాహకాలు ఇస్తోంది. సదుపాయాలు పెరిగాయి. ప్రైవేటు సంస్థలూ సాయమందించేందుకు ముందుకొచ్చాయి. జాతీయ ఆలోచనా విధానం మారినప్పుడు ఒలింపిక్స్‌లో ప్రపంచాన్ని ఓడించే ప్రతిభను ఈ భూమి మీద ఏది అడ్డుకుంటోంది?" అంటూ ఆవేదన వ్యక్తంచేస్తూ ఆనంద్‌ మహీంద్రా శనివారం ఎక్స్‌లో పోస్టు చేశారు.

CM Revanth Reddy On Anand Mahindra : ఆనంద్​ మహీంద్రా ట్వీట్​పై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఆయన పోస్టుకు రీపోస్టు కూడా చేశారు. ‘'మీ ఆవేదనలో దేశంపై ప్రేమ, యువతపై అపారమైన నమ్మకం కనిపిస్తోంది. నేను వ్యక్తిగతంగా ఈ విషయాన్ని మీతో పంచుకోవాలనుకున్నా. కానీ, ఇదే విషయాన్ని దేశ యువత కూడా తెలుసుకోవాలనుకుంటోంది. తెలంగాణలో యంగ్‌ ఇండియా స్కిల్, స్పోర్ట్స్‌ విశ్వవిద్యాలయాలపై పనిచేస్తున్నా. ఇటీవల దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన సందర్భంలో కొరియా నేషనల్‌ స్పోర్ట్స్‌ వర్సిటీ అధ్యక్షుడు మూన్‌ వోన్‌జే బృందాన్ని కలిశా.

హైదరాబాద్‌లో క్రీడా వర్సిటీ ఏర్పాటుకు భాగస్వామిగా ఉండేందుకు కొరియా యూనివర్సిటీ అంగీకరించింది. ఈ పర్యటన ఆగస్టు 13న జరిగితే గడిచిన 72 గంటల్లోనే హకీంపేట, గచ్చిబౌలిలోని 200 ఎకరాల క్యాంపస్‌లతోపాటు అన్ని క్రీడా స్టేడియాల్లో మౌలిక సదుపాయాలను ఒలింపిక్స్‌ గ్రేడ్‌కు సమానంగా తీర్చిదిద్దుతున్నాం.' అని రేవంత్ రెడ్డి తన ట్వీట్​లో వివరించారు.

యువతలో నైపుణ్యాలు పెంచేలా స్కిల్​ యూనివర్సిటీ - TG Govt Focus On Skill University

దసరా నుంచి స్కిల్​ యూనివర్సిటీలో శిక్షణ ప్రారంభం

Last Updated : Aug 18, 2024, 10:42 AM IST

ABOUT THE AUTHOR

...view details