తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ డీఎస్సీ పరీక్ష షెడ్యూల్​ విడుదల.. పూర్తి వివరాలివే? - TELANGANA DSC Exam 2024 Schedule - TELANGANA DSC EXAM 2024 SCHEDULE

TELANGANA DSC Exam 2024 Schedule : రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ నియామాకాల కోసం నిర్వహించే డీఎస్సీ పరీక్ష షెడ్యూల్​ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీఆర్‌టీ విధానంలో రోజుకు రెండు షిఫ్ట్‌లలో డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.

TELANGANA DSC Exam 2024
TELANGANA DSC Exam 2024 Schedule (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 28, 2024, 10:11 PM IST

Updated : Jun 28, 2024, 10:47 PM IST

TELANGANA DSC Exam 2024 Schedule :ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. రాష్ట్రప్రభుత్వం డీఎస్సీ పరీక్ష షెడ్యూల్​ను విడుదల చేసింది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీఆర్‌టీ విధానంలో రోజుకు రెండు షిఫ్ట్‌లలో డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూల్ కింది విధంగా ఉంది.

  • జులై 18 న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్‌ పరీక్ష
  • జులై 18 సెకండ్ షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష
  • జులై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
  • జులై 20న ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు
  • జులై 22 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష
  • జులై 23 న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
  • జులై 24న స్కూల్ అసిస్టెంట్- బయలాజికల్ సైన్స్‌ పరీక్ష
  • జులై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
  • జులై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష
TELANGANA DSC Exam 2024 Schedule (ETV Bharat)
TELANGANA DSC Exam 2024 Schedule (ETV Bharat)
TELANGANA DSC Exam 2024 Schedule (ETV Bharat)

2.79 లక్షల దరఖాస్తులు :రాష్ట్రంలో మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి, ఫిబ్రవరి 28న పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. పరీక్షలకు దరఖాస్తుల గడువు ఈ నెల 20వ తేదీతో ముగిసింది. మొత్తం 2.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అభ్యర్థులపరంగా చూస్తే, సుమారు 2 లక్షల వరకు ఉంటారని తెలుస్తోంది. అంటే ఒక్కో పోస్టుకు సుమారు 25 మంది పోటీ పడుతున్నారు. డీఈడీ, బీఈడీ పూర్తి చేసి టెట్​ ఉత్తీర్ణులైన వారు సెకండరీ గ్రేడ్​ టీచర్ ​(ఎస్జీటీ), స్కూల్​ అసిస్టెంట్​ (ఎస్​ఏ) రెండు పోస్టులకు దరఖాస్తు చేస్తారు.

అలాగే బీఈడీ పూర్తి చేసి టెట్​ పాసైన వారు ఎస్​ఏలోనే రెండు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.అత్యధికంగా హైదరాబాద్​ జిల్లా నుంచి 27,027 ఆ తర్వాత నల్గొండ నుంచి 15,610 దరఖాస్తులు వచ్చాయి. నాన్​లోకల్​ కోటా(ఐదు శాతం) కింద ఇతర జిల్లాల వారు సైతం హైదరాబాద్​లో పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అక్కడ అధికంగా దరఖాస్తులు అందాయని భావిస్తున్నారు.

బుక్​ ముట్టగానే నిద్ర వస్తుందా? ఎక్కువసేపు చదవలేకపోతున్నారా? ఈ టిప్స్ పాటించి చూడండి! - Reading Books Tips And Tricks

స్టేజ్​ ఫియర్​ పోగొట్టుకోవాలనుకుంటున్నారా? ఈ టిప్స్​ పాటిస్తే సక్సెస్​ మీ వెంటే! - tips to overcome stage fright

Last Updated : Jun 28, 2024, 10:47 PM IST

ABOUT THE AUTHOR

...view details