తెలంగాణ

telangana

ETV Bharat / state

'కృష్ణా నదీ ప్రాజెక్టులపై వాస్తవాలు - కేసీఆర్‌ ప్రభుత్వ తప్పిదాలు' - అసెంబ్లీలో ప్రభుత్వం నోట్ - TS Govt Facts on Krishna Projects

Telangana Govt Note on Krishna Projects : ఒక రోజు విరామం తర్వాత తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి సమావేశాల్లో కృష్ణా జలాల వివాదం, ప్రాజెక్టుల అప్పగింతపై రాష్ట్ర ప్రభుత్వం చర్చ జరుపుతోంది. ఇందులో భాగంగా కృష్ణా నదీ ప్రాజెక్టులపై తీర్మానం నేపథ్యంలో రేవంత్ సర్కార్ అసెంబ్లీలో నోట్ ఉంచింది.

Telangana Govt On Krishna Projects
Telangana Govt On Krishna Projects

By ETV Bharat Telangana Team

Published : Feb 12, 2024, 12:01 PM IST

Updated : Feb 12, 2024, 12:16 PM IST

Telangana Govt Note on Krishna Projects : కృష్ణా నదీ ప్రాజెక్టులపై తీర్మానం నేపథ్యంలో అసెంబ్లీ (Telangana Assembly Sessions 2024) ముందు ప్రభుత్వం నోట్‌ ఉంచింది. 'కృష్ణానదీ ప్రాజెక్టులపై వాస్తవాలు - కేసీఆర్‌ ప్రభుత్వ తప్పిదాలు' పేరుతో దీన్ని విడుదల చేసింది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో బీఆర్ఎస్ విఫలమైందన్న ప్రభుత్వం, కేసీఆర్‌ పాపాలే ఇప్పుడు తెలంగాణకు శాపాలుగా మారాయని నోట్‌లో వెల్లడించింది. 2015లోనే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బేసిన్‌పై ప్రాజెక్టులను అప్పగించడానికి సంబంధించిన మాన్యువల్‌ డ్రాఫ్ట్‌కు ఆమోదం తెలిపిందని ప్రభుత్వం పేర్కొంది.

కేంద్ర జల శక్తి మంత్రి అధ్యక్షతన 2020 అక్టోబర్‌ 6వ తేదీన రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగిందని నోట్‌లో తెలిపింది. అప్పటి ముఖ్యమంత్రి ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వమే కేఆర్ఎంబీ(Krishna River Management Board), జీఆర్ఎంబీ(Godavari River Management Board) అధికార పరిధిని నోటిఫై చేస్తుందని ఆ భేటీలో నిర్ణయం జరిగిందని చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014లో నిర్దేశించిన మేరకు కేఆర్ఎంబీ అధికార పరిధి నిర్దేశిస్తారని కేంద్రమంత్రి అప్పుడే స్పష్టం చేశారని నోట్‌లో ప్రభుత్వం పేర్కొంది.

కృష్ణా ప్రాజెక్టులను కేఆర్​ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదు : మంత్రి ఉత్తమ్​

Facts on Krishna River Projects : కృష్ణా మీద ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించే ప్రసక్తి లేదని, కృష్ణా నదీ జలాల్లో న్యాయంగా రావాల్సిన వాటాలు రాబట్టుకునేందుకు తగిన చర్యలు చేపడతామని రేవంత్ రెడ్డి సర్కార్(Telangana Govt on Projects Handover To KRMB) స్పష్టం చేసింది. గత ప్రభుత్వం తప్పులు సమీక్షించుకొని, ఇప్పటివరకు జరిగిన అన్యాయాన్ని జల దోపిడిని అడ్డుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని వెల్లడించింది. ఈ అంశాలకు సంబంధించిన ఆధారాలను నోట్‌లో ప్రభుత్వం పొందుపరించింది.

"2015 ఆగస్టులోనే శ్రీశైలం (Srisailam Dam), నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు(Nagarjuna Sagar Dam)లను కేంద్రానికి అప్పగించే ముసాయిదాను ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అప్పటి నుంచి కేసీఆర్‌ అధికారం దిగిపోయే రోజు వరకు ఈ ప్రాజెక్టులను అప్పగించేందుకే గత ప్రభుత్వం మొగ్గు చూపింది. ప్రాజెక్టులను అప్పగించిన విషయం మీకు తెలుసని ఇరిగేషన్‌ సెక్రెటరీ స్మితా సభర్వాల్‌ కేఆర్‌ఎంబీకి రాసిన చివరి లెటర్‌ వరకు అందుబాటులో ఉన్న ఆధారాలన్నీకేసీఆర్‌ ప్రభుత్వం అనుసరించిన తెలంగాణ విధ్వంస వైఖరిని బట్టబయలు చేశాయి. గత ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాలు కేసీఆర్‌ చేసిన పాపాలే ఇప్పుడు తెలంగాణకు శాపాలుగా మారాయి. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు మేం కట్టుబడి ఉన్నాం." అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

కృష్ణా జలాల జగడంపై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చ - బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టేలా కార్యాచరణ

నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల - ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం

Last Updated : Feb 12, 2024, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details