తెలంగాణ

telangana

ETV Bharat / state

గుడ్​న్యూస్ - ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచిన సర్కార్ - DA HIKE FOR EMPLOYEES IN TELANGANA

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3.64శాతం పెంచిన రాష్ట్ర ప్రభుత్వం - పెరిగిన డీఏ 2022 జులై 1వ తేదీ నుంచి వర్తింపు - నవంబర్ జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపు

DA HIKE FOR EMPLOYEES IN TELANGANA
DA HIKE FOR EMPLOYEES IN TELANGANA (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 30, 2024, 8:41 PM IST

DA Hike For Govt Employees In Telangana : దీపావళికి ముందు రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్​న్యూస్ చెప్పింది. డీఏ పెంచుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు డీఏ 3.64శాతం పెంచుతూ ఆదేశాలు జారీచేసింది. ఇటీవల కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపుతో ప్రస్తుతం ఉన్న 22.75 శాతం డీఏ 3.64 పెరిగి 26.39 శాతానికి చేరింది. పెరిగిన డీఏ 2022 జూలై ఒకటో తేదీ నుంచి వర్తించనుంది. డిసెంబర్ ఒకటిన చెల్లించే నవంబర్ జీతంతో కలిపి పెరిగిన డీఏ ఉద్యోగుల చేతికి అందనుంది.

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం :2022 జులై ఒకటి నుంచి 2024 అక్టోబర్ 31వరకు డీఏ బకాయిల మొత్తాన్ని జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. 2025 మార్చి 31వ తేదీ లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు డీఏ బకాయిలు 17 సమాన వాయిదాల్లో చెల్లింపు చేస్తారు. సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిల్లో పదిశాతాన్ని ప్రాన్ ఖాతాకు జమ చేసి, మిగిలిన 90 శాతం మొత్తాన్ని 2025 ఫిబ్రవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లిస్తారు. జీపీఎఫ్ ఖాతాలు లేని ఫుల్ టైం కంటింజెంట్ ఉద్యోగులకు 2025 ఫిబ్రవరి నుంచి 17 సమాన వాయిదాల్లో డీఏ బకాయిలు ఇస్తారు. విశ్రాంత ఉద్యోగులకు డీఏ బకాయిలు 2025 జనవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లింపు చేస్తారు. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

ఇటీవలే సీఎంను కలిసిన ఉద్యోగ సంఘాలు :డీఏ పెంచాలని కొద్దిరోజులుగా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ డిమాండ్లపై ఏకరవు పెట్టారు. పరిశీలించిన ముఖ్యమంత్రి డీఏ పెంపునపై వెంటనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నెల 26న జరిగిన కేబినెట్ భేటీలో మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఉద్యోగులకు కేంద్రం దీపావళి గిఫ్ట్- DA పెంపు- రైతులకు గుడ్​న్యూస్
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​- 4% పెంపు- 50 శాతానికి చేరిన DA

ABOUT THE AUTHOR

...view details