Telangana Govt Exercise in Job Exam Results: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లకు త్వరలో 1:2 నిష్పత్తిలో ఎంపిక జాబితాలను ప్రకటించనుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై సర్కార్ పరిపాలనా పరమైన విధాన నిర్ణయం తీసుకోనుంది. వీటి అమలుకు ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖ, టీఎస్‌పీఎస్సీ, మహిళా సంక్షేమ శాఖలు సంయుక్తంగా ముసాయిదా విధానాన్ని రూపొందించాయి. అత్యంత కీలకమైన ఈ రిజర్వేషన్ల విధానం అమలు కోసం దస్త్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి(CM Revanth Reddy) పంపించాయి. ఈరోజు కేబినేట్ సమావేశంలో చర్చించాక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి
ఈ నెలలోనే ఫలితాలివ్వాలి :మరోవైపు ఇప్పటికే పరీక్షలు నిర్వహించిన నియామక సంస్థలు ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉండాలని తెలంగాణ సర్కార్ సూచించింది. ఉత్తర్వులు వచ్చిన వారం నుంచి పది రోజుల్లోనే విడుదల చేయాలని స్పష్టం చేసింది. నియామక సంస్థలు నోటిఫికేషన్ల వారీగా లక్ష్యాలు సిద్ధం చేసుకోవాలని, న్యాయ వివాదాలకు ఆస్కారం లేకుండా ఫలితాలు ప్రకటించాలని ప్రభుత్వం కోరింది.
గ్రూప్-1పై ప్రభుత్వం కసరత్తు - అదనపు ఖాళీల వివరాలపై ఆరా
Telangana Government Focus on Filling Jobs 2024 : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలో యుద్ధ ప్రాతిపదికన ఏఈఈ, ఏఈ, గ్రూప్-4 ఫలితాలు వెల్లడించేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది. గురుకుల నియామక సంస్థ పరిధిలో వారం రోజుల్లో కనీసం టీజీటీ, పీజీటీ లేదా డిగ్రీ, జూనియర్ లెక్చరర్ల ఫలితాలు వెల్లడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కావడంతో ఫలితాలు వెల్లడించేందుకు తాజా రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకారం సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తున్నాయి.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి :మరోవైపు సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు మహిళలకు సమాంతర రిజర్వేషన్లకు సంబంధించి నిబంధనలు చేర్చినట్లు తెలిసింది. మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమల్లో వారికి న్యాయమైన వాటా దక్కేలా నిబంధనలు రూపొందించినట్లు తెలుస్తోంది. సర్కార్ ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు వీటి అమలు ప్రస్తుత తేదీ నుంచి కాకుండా గత తేదీ నుంచి ఇవ్వనుంది. తద్వారా నియామకాల్లో న్యాయ వివాదాలకు పరిష్కారం చూపించినట్లు అవుతుందని భావిస్తోంది.
TSPSC Aspirants Confusion : గ్రూప్-1 చదవాలా.. గ్రూప్-2కు ప్రిపేర్ అవ్వాలా.. అయోమయంలో అభ్యర్థులు
గ్రూప్-1 ప్రకటనపై కొత్త ప్రభుత్వం నిర్ణయమే కీలకం - మరీ చిక్కుముడి వీడేదెలా?