Telangana Govt Alert On HMPV virus Cases :చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాన్యూమో వైరస్) మహమ్మారి పొరుగు రాష్ట్రాలలో కొందరి చిన్నారుల్లో గుర్తించారు. శీతాకాలంలో చిన్నపిల్లలు, వృద్ధులలో చలి, జలుబు వంటి లక్షణాలను కలిగించే సాధారణ శ్వాస సంబంధిత వైరస్‌గా డాక్టర్లు చెబుతున్నారు. కరోనా అంతటి ప్రమాదకరమైందని కాదని, జాగ్రత్తలను పాటిస్తే దరచేరదని వైద్యాధికారులు అంటున్నారు. ఈ వైరస్ వచ్చిన ఐదేళ్ల లోపు పిల్లల్లో దగ్గు, జలుబు, జ్వరం, న్యుమోనియా లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. రోగ నిరోధక శక్తి తగ్గకుండా చిన్నపిల్లలు, వృద్ధులు పోషహకారం తీసుకోని తగిన జాగ్రత్తలు పాటిస్తే ఈ వైరస్‌తో ప్రమాదం ఉండదని చెబుతున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలోని పట్టణ ఆరోగ్య కేంద్రానికి రోజుకు 50 మంది వరకు వస్తారు. చలికాలం కావడంతో ఇప్పుడు 65మంది వరకు వస్తున్నట్లు వైద్యాధికారిణి డా.మాలిక చెప్పారు. చైనాలో హెచ్ఎంపీవీ విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేశామని, మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మూడు రోజుల పాటు జ్వరం, దగ్గు, జలుబు తగ్గకుండే వైద్య పరీక్షలు చేయిస్తున్నట్లు వివరించారు.
పెరుగుతున్న జలుబు, దగ్గు కేసులు : పరకాల సివిల్ ఆస్పత్రికి దగ్గు, జలుబు లక్షణాలతో వస్తున్న వారి సంఖ్య గత పది రోజులుగా పెరుగుతోంది. మంగళవారం 160 రోగులు వచ్చారు. ఇవి సాధారణ జబ్బులేనని చైనాలో విజృంభిస్తున్న వైరస్ కాదని వైద్యాధికారి డా.బాలకృష్ణ స్పష్టం చేశారు. ఆసుపత్రిలో మందుల కొరత లేదని తెలిపారు. ఎక్కువ సమస్యతో బాధపడుతున్న వారిని ఆసుపత్రిలోనే చేర్చుకొని వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు.
'పిల్లల్లోనే HMPV ప్రభావం ఎక్కువ'- ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని సలహా!