Telangana SSC Results Released :తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్. రిజల్ట్స్ కోసం చూస్తున్న వారి ఎదురు చూపులకు తెరదించుతూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలు విడుదల చేశారు. మీరు మీ రిజల్ట్స్ చెక్ చేసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.
పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా 91.31శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సారి కూడా రిజల్ట్స్‌లో బాలికలదే పైచేయి. బాలికలకు ఉత్తీర్ణత శాతం 93.23, బాలుర ఉత్తీర్ణత శాతం 89.42 లభించింది. 3,927 పాఠశాలల్లో వంద శాతం మంది విద్యార్థులు పాస్ కాగా, 6 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత వచ్చింది. సున్నా ఫలితాలు వచ్చిన పాఠశాలలన్నీ ప్రైవేట్‌వే అని బుర్రా వెంకటేశం తెలిపారు. 99.09 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిర్మల్ జిల్లా, 98.65 శాతంతో రెండో స్థానంలో సిద్దిపేట జిల్లా, 98.27 శాతంతో మూడో స్థానంలో సిరిసిల్ల జిల్లా, 65.10 ఉత్తీర్ణతతో అట్టడుగున వికారాబాద్ జిల్లాలు నిలిచాయని ఆయన వెల్లడించారు. పరీక్షల్లో విఫలమైన విద్యార్థులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదని సూచించారు.
తెలంగాణ పదో తరగతి ఫలితాలు - ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేసుకోండి ! - How To Check TS SSC Results 2024
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 5లక్షల 8వేల 385 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో బాలురు 2లక్షల 57వేల 952 మంది కాగా, బాలికలు 2లక్షల, 50వేల 433 మంది ఉన్నారు. సుమారుగా 30వేల మంది ఇన్విజిలేటర్లు విధుల్లో పాల్గొన్నారు. ఏప్రిల్ 20లోపు మూల్యాంకనాన్ని పూర్తి చేశారు. అలాగే మార్కుల నమోదుతో పాటు ఎలాంటి టెక్నికల్ ఇబ్బందులూ రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
599/600 - టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన మనస్వీ - AP SSC Toppers Inspiring Stories
ఇలా చెక్ చేసుకోండి:పది ఫలితాలను అధికారులు అధికారికంగా ప్రకటించగానే అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్లి తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. రిజల్ట్స్ రిలీజ్ అయ్యాక వాటిని అధికారిక వెబ్సైట్https://results.bse.telangana.gov.inకి లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు.
- ముందుగా తెలంగాణ స్టేట్ బోర్డ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. bse.telangana.gov.in
- తర్వాత స్క్రీన్ మీద కనిపించే Results ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- స్క్రీన్‌పై కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- అందులో Hall Ticket Number ఎంటర్ చేసి Submit బటన్‌పై క్లిక్ చేస్తే మీ రిజల్ట్ కనిపిస్తాయి.
- ఆ మెమోను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- 10th results
బాల్యవివాహం నుంచి బయటపడి కల దిశగా ప్రయాణం - ఇంటర్ ఫలితాల్లో టాప్ మార్కులు - Inter First Year Top Scorer Nirmala