తెలంగాణ

telangana

ETV Bharat / state

దసరా సెలవులు వచ్చేశాయ్ - అఫీషియల్ డేట్స్ ఇవే! - మొత్తం ఎన్ని రోజులో తెలుసా? - Telangana Dussehra Holidays 2024

Dussehra Holidays 2024: తెలంగాణ ప్రభుత్వం గుడ్​న్యూస్​ చెప్పింది. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరి సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటివరకో ఇప్పుడు చూద్దాం...

DUSSEHRA HOLIDAYS 2024 IN TELANGANA
Telangana Dussehra Holidays 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 19, 2024, 6:09 PM IST

Telangana DussehraHolidays 2024: పిల్లలకు సెలవులు అంటే మస్త్​ ఇష్టం. ఎప్పుడెప్పుడు హలీడేస్​ వస్తాయా.. ఎప్పుడెప్పుడు ఊరు వెళ్లి ఎంజాయ్​ చేయాలా అని ఆలోచిస్తుంటారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరి సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు? స్కూళ్లు ఎప్పుడు మొదలవుతాయో ఈ స్టోరీలో చూద్దాం..

ఆ రోజుల్లో సెలవులు: రాష్ట్రంలో విద్యాసంస్థలకు దసరా పండగ నేపథ్యంలో మొత్తం 13 రోజుల పాటు సెలవులను డిక్లేర్​ చేసింది ప్రభుత్వం. అక్టోబర్ 2వ తేదీ(బుధవారం) నుంచి 14వ తేదీ(సోమవారం) వరకు సెలవులుగా ప్రకటించింది. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతితో సెలవులు మొదలు కానున్నట్లు వివరించింది. ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్టు ప్రకటించాయి. ఇక జూనియర్​ కాలేజీల విషయానికి వస్తే అక్టోబర్​ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.

మళ్లీ ఆరోజే పునఃప్రారంభం:అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు అంటే మొత్తంగా 13రోజులు సెలవుల తర్వాత అక్టోబర్​ 15(మంగళవారం) రోజున స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. ఇక కాలేజీలు అక్టోబర్​ 14న తెరుచుకోనున్నాయి.​ వరుసగా 13 రోజులు సెలవులు రావడంతో విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు. ఊర్లకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.

కాగా, తెలంగాణ సర్కార్‌ మే 25వ తేదీన 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి క్యాలెండ‌ర్‌ను విడుద‌ల చేసింది. అక్టోబ‌ర్ 2 నుంచి 14వ తేదీ వ‌ర‌కు ద‌స‌రా సెల‌వులు, డిసెంబ‌ర్ 23 నుంచి 27 వ‌ర‌కు క్రిస్మ‌స్ సెల‌వులు, జ‌న‌వ‌రి 13 నుంచి 17వ తేదీ వ‌ర‌కు సంక్రాంతి సెల‌వులు ఉంటాయని ప్రకటించింది. ఇక 2025, ఏప్రిల్ 23వ తేదీ వ‌ర‌కు పాఠ‌శాల‌లు కొనసాగుతాయని, 2025 ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ లోపు ప‌దో త‌ర‌గ‌తి ప్రి ఫైన‌ల్ ప‌రీక్ష‌లు పూర్తి చేయనున్నట్లు తెలిపింది. 2025 మార్చిలో ప‌దో త‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్ష‌లు నిర్వహించనున్నారు.

ఇక ఇటీవల తెలంగాణలో భారీ వర్షాల కారణంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఆ తర్వాత 14, 15, 16తేదీల్లోనూ సెలవులు వచ్చాయి. 17వ తేదీన కొన్ని ప్రాంతాల్లో వినాయక నిమజ్జనం సందర్భంగా సెలవు ఇచ్చారు. ఇటు సెప్టెంబర్ 22, 28, 29 తేదీల్లోనూ స్కూళ్లకు సెలవు రానుంది. దీంతో సెప్టెంబర్, ఆక్టోబర్ నెలలో స్కూళ్లకు ఎక్కువగా హాలీడేస్ వచ్చాయి. మరోవైపు సెప్టెంబర్ 20వ తేదీ నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. అతి భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో మళ్లీ స్కూళ్లకు సెలవు ప్రకటించే అవకాశం లేకపోలేదు.

సంక్రాంతికి ఊరెళ్లాలా? - అయ్యో!! టికెట్లు లేవండి బాబు

విద్యార్థులకు మరోసారి వరుస సెలవులు - ఈసారి ఏకంగా 5 రోజులు

విద్యార్థులకు గుడ్​న్యూస్- వరుసగా 3రోజులు హాలీడేస్​- సెప్టెంబర్​లో పాఠశాలలకు భారీగా సెలవులు!

ABOUT THE AUTHOR

...view details