రాష్ట్రంలో తగ్గిన జీలుగ విత్తనాల సప్లై పడిగాపులు కాస్తున్న రైతులు Farmers Struggling for Jeelugu Seeds in Telangana :మెదక్ జిల్లా అల్లాదుర్గం, టేక్మాల్ మండల కేంద్రంలో జీలుగ విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. ఒకవైపు సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించాలని చెబుతున్న అధికారులు ఆచరణ విషయానికి వచ్చేసరికి విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడం సరికాదన్నారు. తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ, నేషనల్ సీడ్ కార్పొరేషన్ వారు జీలుగ, జనుమ విత్తనాలను సరఫరా చేస్తామని టెండర్లు తీసుకున్నారని వారు సప్లై చేయడంలో ఆలస్యం అవుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ అన్నారు. రైతులకు పచ్చి రొట్ట విత్తనాలు అందించేలా కృషి చేస్తాం అన్నారు.
జగిత్యాల జిల్లా మల్యాల సింగిల్ విండో కార్యాలయం ముందు జీలుగ విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. 500 మంది రైతులు విత్తనాల కోసం తెల్లవారు జామున వచ్చి క్యూలో నిలబడ్డారు. కానీ జీలుగ విత్తనాల కొరత మూలంగా ఒక్కో రైతుకు ఒక్క బ్యాగు మాత్రమే ఇస్తున్నారు. దీనితో సరిపడా విత్తనాలు ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 10కిలోల జీలుగ విత్తనాలను ఉపయోగిస్తే సాగు చేస్తే భూసారం పెరిగి పంట దిగుబడి పెరిగే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.
విత్తనాల కోసం రైతుల పడిగాపులు - ఆగ్రో సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు - SUBISDY SEEDS SHORTAGE IN TELANGANA
"పొద్దున వచ్చినం ఇక్కడికి అయినా విత్తనాలు దొకడం లేదు. ఇక్కడ దాదాపు వెెయ్యి మంది ఉన్నాం. అసలు విత్తనాలు దొరుకుతాయో లేదో కూడా తెలియదు. ఆన్లైన్లో బుక్‌చేసుకున్న వారికి కూడా వస్తాయో లేదో కూడా తెలియదు. ఒక్కరికి ఒక్క బ్యాగు మాత్రమే ఇస్తున్నారు. ఎక్కువ పొలం ఉన్న వారికి కష్టమవుతుంది. మధ్యరాత్రి రెండున్నర నుంచి లైన్లో నిల్చున్నాం .కానీ లోపల ఎన్ని బస్తాలు ఉన్నాయి? అవి మాకు అందుతాయో లేదో తెలియదు." - రైతులు
జిల్లా మొత్తం ఒకే సెంటర్ : కామారెడ్డిలోని గాంధీగంజ్‌లో రైతులు ఎండలో నిలబడి విత్తనాల కోసం పడిగాపులు కాస్తున్నారు. అన్ని గ్రామల రైతులకు ఒకే వద్ద విత్తనాలు ఇవ్వడంతో ఎండలో ఉండాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 4 గంటలకు సొసైటీ వద్దకు చేరుకోని జీలుగ కోసం వస్తే అధికారులు కేవలం ఒక బస్తానే రైతులకు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల రెండు, మూడు, నాలుగు ఎకరాలున్న రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకొని రైతులకు సరిపడా జిలుగు బస్తాలను సప్లై చేయాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
జీలుగ విత్తనాల కోసం అన్నదాతల పడిగాపులు!
విత్తన సబ్సిడీ ప్రకటించిన ప్రభుత్వం