TG DSC Hall Tickets 2024 :తెలంగాణలో నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షకు హాల్‌టికెట్లు ఈనెల 11వ తేదీ సాయంత్రం నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు. ఈనెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని ఇటీవల విద్యాశాఖ షెడ్యూల్‌ను ప్రకటించింది.
డీఎస్సీ హాల్‌టికెట్లను www.schooledu.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 29న మొత్తం 11,062 పోస్టుల భర్తీకి సర్కారు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు మార్చ్ 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించిన విద్యాశాఖ, ఈ నెల 18 నుంచి సీబీటీ బేసిడ్ టెస్ట్ నిర్వహించనుంది.
TJS Chief Kodandaram React on DSC Issue : పోటీ పరీక్షల అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రొఫెసర్ హరగోపాల్‌తో కలిసి టీజీపీఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లామని టీజేఎస్ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం తెలిపారు. కమిషన్ ఛైర్మన్ మహేందర్ రెడ్డి అన్ని విషయాలను సీరియస్‌గా విన్నారని, విద్యార్థుల అవేదన, ఆందోళన గురించి వివరించామని చెప్పారు.
ఈ క్రమంలోనే గ్రూపు-1 జాబ్స్ కోసం 1:100 నిష్పత్తిలో పిలవాలని కోరామని వెల్లడించారు. డీఎస్సీ, గ్రూపు -2 మధ్య సమయం తక్కువగా ఉందని, డీఎస్సీని, గ్రూపు-2ని వాయిదా వేసి ఈ రెండు పరీక్షల మధ్య కొంత వ్యవధి ఉంటే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని వివరించినట్లు కోదండరాం పేర్కొన్నారు. మహేందర్ రెడ్డి అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు.