తెలంగాణ

telangana

ETV Bharat / state

త్వరలో కరెంట్ షాక్ తప్పదు! - కాకుంటే వారిపై మాత్రమే భారం

తెలంగాణలో పెరగనున్న కరెంటు చార్జీలు - ఇళ్లలో నెలకు 300 యూనిట్లు దాటితే స్థిరఛార్జీని రూ.10 నుంచి రూ.50 పెంచాలని నిర్ణయం

ELECTRICITY BILL IN TELANGANA
Electricity Bill Charges In Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 26, 2024, 3:32 PM IST

Current Charges In Telangana : రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలు సవరించాలని విద్యుత్‌ పంపిణీ సంస్థలు ప్రతిపాదించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ యూనిట్ల కరెంటు వాడితే స్థిరఛార్జీని రూ.10 నుంచి రూ.50 పెంచాలని తెలిపాయి.

హైటెన్షన్‌ వినియోగదారులకు 11కేవీ కనెక్షన్‌ స్థాయిలోనే 33కేవీ, 132 కేవీ కనెక్షన్లకు విద్యుత్‌ ఛార్జీలను పెంచి వసూలు చేస్తామన్నాయి. ఈ ప్రతిపాదనలపై ఈఆర్‌సీ విచారణ కూడా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయనే వివరాలతో డిస్కంలు ఈఆర్‌సీకి తాజాగా నివేదికను అందజేసాయి.

ఇళ్లలో 300 యూనిట్లు దాటితే : నెలకు 300 యూనిట్లకు పైగా వస్తున్న ఇళ్ల కరెంటు కనెక్షన్‌కు స్థిరఛార్జీని మహారాష్ట్రలో నెలకు రూ.148, కర్ణాటకలో రూ.120, ఉత్తర్‌ప్రదేశ్‌లో రూ.53, గుజరాత్‌లో రూ.45 చొప్పున వసూలు చేస్తున్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయించిన రూ.10 స్థిరఛార్జీనే ఏపీ, తెలంగాణలో ఇప్పటికీ కొనసాగుతోందని వివరించారు.

లోటెన్షన్‌ వాణిజ్య కేటగిరీ కనెక్షన్లకు తెలంగాణలో నెలకు ప్రస్తుతం రూ.70 వసూలు చేస్తుండగా రూ.150కి పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి. ఇదే కేటగిరీకి మహారాష్ట్రలో రూ.626, యూపీలో రూ.355, కర్ణాటకలో రూ.255, తమిళనాడులో రూ.107 చార్జీలు వసూలు చేస్తున్నట్లు డిస్కంలు తెలిపాయి.

300 యూనిట్లు దాటే ఇళ్లకు స్థిరఛార్జీలు : తెలంగాణలో నెలకు 300 యూనిట్లు దాటే ఇళ్లకు స్థిరఛార్జీలను పెంచితే అదనంగా రూ.328 కోట్ల ఆదాయం వస్తుందని డిస్కంలు ఈఆర్‌సీకి వివరించాయి. పరిశ్రమలకు కరెంటు ఛార్జీల పెంచితే వాటిపై ఆర్థికభారం పడుతుందని ప్రతిపక్షాలు ఈఆర్‌సీకి ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో హెచ్‌టీ కేటగిరీకి వసూలు చేస్తున్న ఛార్జీల వివరాలను డిస్కంలు ఈఆర్‌సీకి నివేదించాయి.

హెచ్‌టీ పరిశ్రమల కనెక్షన్లకు : ప్రస్తుతం తెలంగాణలో హెచ్‌టీ పరిశ్రమల కనెక్షన్లకు 11కేవీకి యూనిట్‌కు రూ.7.65, 33కేవీకి రూ.7.15, 132కేవీకి రూ.6.65 చొప్పున డిస్కంలు వసూలు చేస్తున్నాయి.ఇకపై ఈ మూడు ఈ కేటగిరీలకు యూనిట్‌కు రూ.7.65 చొప్పున వసూలు చేస్తామని తెలిపాయి. కానీ ప్రస్తుతం మహారాష్ట్రలో యూనిట్‌కు రూ.8.36, కర్ణాటకలో రూ.7.40, గుజరాత్‌లో రూ.6.90, తమిళనాడులో రూ.6.90 చొప్పున హెచ్‌టీ పరిశ్రమల నుంచి వసూలు చేస్తున్నారు.

హెచ్‌టీ వాణిజ్య కనెక్షన్‌ :హెచ్‌టీ వాణిజ్య కనెక్షన్‌కు మన రాష్ట్రంలో యూనిట్‌కు రూ.8.80 వసూలు చేస్తుండగా మహారాష్ట్రలో రూ.13.21, కర్ణాటకలో రూ.9.25, తమిళనాడులో రూ.8.70గా ఉన్నట్లు డిస్కంలు వివరించాయి. ఇదే కేటగిరీలో స్థిరఛార్జీని రూ.475 నుంచి రూ.500కి పెంచాలని ప్రతిపాదించామని, కానీ ఇప్పటికే మహారాష్ట్రలో రూ.664, తమిళనాడులో రూ.590, గుజరాత్‌లో రూ.570 వసూలు చేస్తున్నట్లు డిస్కంలు స్పష్టం చేశాయి. హెచ్‌టీ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్‌సీ ఆమోదిస్తే రూ.700 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా. ఈఆర్‌సీ ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ఈ నెల 29తో ముగియనున్న నేపథ్యంలో మరో 2, 3 రోజుల్లో ఛార్జీల పెంపుపై తుది తీర్పు ఇవ్వనుంది.

వినియోగదారులకు 'కరెంట్' షాక్ - మళ్లీ పెరగనున్న విద్యుత్ ఛార్జీలు - ELECTRICITY CHARGES REVISE IN TG

ఈ జాగ్రత్తలు పాటిస్తే - విద్యుత్ వినియోగం తగ్గించుకోవచ్చు! - "జీరో బిల్లు" పొందవచ్చు! - How to Save Electricity

ABOUT THE AUTHOR

...view details