Telangana Congress PEC Meeting : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ఎంపికపై సభ్యుల అభిప్రాయాలను కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీ తీసుకుంది. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది.
రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు టికెట్లు ఆశిస్తూ 309 మంది దరఖాస్తులు చేశారు. ఈ ఆశావహుల జాబితా నుంచి వడపోత కార్యక్రమం కొనసాగింది. 309 మందికి సంబంధించిన జాబితాను ప్రదేశ్ ఎన్నికల కమిటీ సభ్యులకు అందజేశారు. ప్రతి నియోజకవర్గంలో నుంచి ప్రాధాన్యత కార్యక్రమంలో ఒకటి, రెండు, మూడు అని టిక్ చేసి కమిటీకి నివేదించినట్లు సమాచారం. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బయటపడుతున్న లోటుపాట్లపై ప్రభుత్వ పరంగా ముందుకు ఏ విధంగా వెళ్లాలన్న అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.
Telangana Congress PEC Meeting at Gandhi Bhavan :100 రోజుల్లో ఆరు గ్యారెంటీల(Congress Six Guarantees) అమలలో భాగంగా మరో రెండు గ్యారెంటీలు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైన విషయాన్ని ముఖ్యమంత్రి సభ్యులకు తెలియజేసినట్లు తెలిసింది. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన సమీక్షల ద్వారా వెల్లడైన అవినీతి అక్రమాలకు సంబంధించి, ప్రాజెక్టుల నిర్మాణానికి గత ప్రభుత్వం పెట్టిన ఖర్చు, అందుబాటులోకి వచ్చిన ఆయకట్టు తదితర అంశాలను శ్వేత పత్రం ద్వారా అసెంబ్లీ వేదికగా వెల్లడిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
ఆరు గ్యారంటీలు, ఇతర హామీల అమలులో అధికారులదే కీలక పాత్ర : సీఎం రేవంత్ రెడ్డి