తెలంగాణ

telangana

ETV Bharat / state

నామినేటెడ్ పదవుల భర్తీకి కాంగ్రెస్ కసరత్తు - టికెట్‌ త్యాగం చేసిన వారికే ప్రాధాన్యం - MLC Candidates in Congress

Telangana Congress Focus On Nominated Posts 2024 : కాంగ్రెస్‌లో నామినేటెడ్‌ పదవులు ఆశిస్తున్న నాయకులకు ఏ క్షణమైనా శుభవార్త అందే అవకాశం ఉంది. ఇప్పటికే కసరత్తు పూర్తి కాగా సీఎం రేవంత్‌ రెడ్డి దావోస్‌ పర్యటన ముగియటంతో మొదటి విడతలో 20మంది పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవలే ప్రభుత్వ సలహాదారులుగా నలుగురిని నియమించిన సర్కార్‌ తాజాగా భర్తీ చేయనున్న నామినేటెడ్‌ పదవుల్లో ఆర్టీసీ, టీఎస్‌ఐఐసీ, సీడ్‌ కార్పొరేషన్‌, పర్యాటక, అబ్కారీ పౌరసరఫరాల శాఖ వంటి ప్రధానమైనవి ఉండే అవకాశం ఉంది.

Congress Leaders Hope On Nominated Posts
Telangana Congress Focus On Nominated Posts 2024

By ETV Bharat Telangana Team

Published : Jan 23, 2024, 2:38 PM IST

Telangana Congress Focus On Nominated Posts: శాసనసభ ఎన్నికల సమయంలో టికెట్‌ త్యాగం చేసి పార్టీ గెలుపునకు పనిచేసిన నేతలకు నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఇటీవలే వేం నరేందర్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, మల్లు రవి, హర్కార వేణుగోపాల్‌ను ప్రభుత్వ సలహాహారులుగా నియమించింది. నామినేటెడ్‌ పదవులు సంక్రాంతి లోపలే భర్తీ చేస్తామని సీఎం ప్రకటించినప్పటికీ దావోస్‌ పర్యటనతో ఆలస్యమైనట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

పది మంది పేర్లతో జాబితా సిద్ధమైనప్పటికీ దావోస్‌ పర్యటన తర్వాత మరికొందరికి ఇవ్వాలని భావించినట్లు సమాచారం. తాజాగా సీఎం రేవంత్‌ రెడ్డికి కలసొచ్చే 9 సంఖ్య వచ్చేలా నామినేటెడ్‌ పదవులు భర్తీ చేసేందుకు మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. అంటే 18 లేదా 27 మందికి ఛైర్మన్‌ పదవులు భర్తీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

12 లోక్​సభ స్థానాలపై కాంగ్రెస్ గురి - బూత్‌ స్థాయిలో బలోపేతంపై దృష్టి

Congress Leaders Hope On Nominated Posts : ఉమ్మడి జిల్లాల వారీగా నామినేటెడ్‌ పదవులు పొందేందుకు అవకాశం ఉన్న నేతల్లో సీఎం సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా ఆశావహులు ఉన్నారు. యువజన రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుడు శివసేనా రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి చారకొండ వెంకటేష్‌, ఓబీసీసీ జాతీయ సమన్వయకర్త కేతూరి వెంకటేష్‌, డీసీసీ అధ్యక్షులు సంజీవ్‌ ముదిరాజ్‌, ఒబెదుల్లా కొత్వాల్‌, కొల్లాపూర్‌ జగదీశ్వరరావు రేసులో ఉన్నారు.

హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ ఫిషరీస్‌ విభాగం ఛైర్మన్‌ సాయికుమార్‌, యువజన కాంగ్రెస్‌ నేత రోహిత్‌, ఓబీసీ ఛైర్మన్‌ నూతి శ్రీకాంత్‌ గౌడ్‌, శ్రీకాంత్‌ యాదవ్‌, నిజాముద్దీన్‌, రంగారెడ్డి జిల్లాలో మల్‌రెడ్డి రామిరెడ్డి, సంకేపల్లి సుధీర్ రెడ్డి, చరణ్‌ కౌశిక్‌, సామ రామ్మోహన్‌ రెడ్డి, చిలక మధు, భూపతి నర్సారెడ్డి, కిషోర్‌ రెడ్డి, మాజీ మంత్రి పుష్పలీల నామినేటెడ్‌ పదవులు ఆశిస్తున్నారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ​- ఛాన్స్​ కొట్టేసింది వీరే!

Senior Congress Leaders Hope On Nominated Posts: మెదక్‌లో ప్రచార కమిటీ కో కన్వీనర్‌ M. భవాణి రెడ్డి, బండారు శ్రీకాంత్‌, కరీంనగర్‌లో సత్తు మల్లేష్‌, గజ్జల కాంతం, నేరెళ్ల శారద కార్పోరేషన్‌ ఛైర్మన్‌ల రేసులో ఉన్నారు. వరంగల్‌ నుంచి రవళి రెడ్డి, మొగుళ్ల రాజిరెడ్డి, నెహ్రు నాయక్‌, బెల్లయ్య నాయక్‌, బండి సుధాకర్‌, లింగోజి ఆశావహుల జాబితాలో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో లోకేష్‌ యాదవ్‌, పొట్ల నాగేశ్వరరావు, విజయాబాయి, రాయల నాగేశ్వరావు, నల్గొండలో కైలాస్‌ నేత, పటేల్‌ రమేష్‌ రెడ్డి, చెవిటి వెంకన్న, శంకర్‌నాయక్‌, బండ్రు శోభారాణిల నుంచి ఎంపికయ్యే అవకాశం ఉంది.

నిజామాబాద్‌లో మాజీ విప్‌ అనిల్‌, గంగారాం, కైలాస్‌ శ్రీనివాస్‌, కిసాన్‌ కాంగ్రెస్‌రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌ రెడ్డి, వేణుగోపాల్‌ యాదవ్‌, ఆదిలాబాద్‌ నుంచి నరేష్‌ జాదవ్‌, సేవాలాల్‌ రాథోడ్‌, గోమాత శ్రీనివాస్‌, విశ్వప్రసాద్‌ రావులు ఉన్నారు. మహిళ కమిషన్‌తో పాటు అనేక రకాల నామినేటెడ్‌ పదవులు భర్తీ చేయాల్సి ఉండటంతో ఆశావహులందరికీ న్యాయం చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Nominated posts in Telangana : నామినేటెడ్‌ పదవుల భర్తీలోనూ పార్టీకి ప్రయోజనం ఉండేలా సామాజిక సమీకరణాలను విశ్లేషిస్తున్నారు. అన్ని వర్గాలకు అవకాశం కల్పించే దిశలో కసరత్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా పార్టీ కోసం పని చేసిన నాయకుల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉండటంతో ఎక్కువ భాగం పదవులు అతివలకే దక్కే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కాంగ్రెస్​ ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా మహేష్‌ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్‌

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ​- ఛాన్స్​ కొట్టేసింది వీరే!

ABOUT THE AUTHOR

...view details