CM Revanth Consoled MLA Satyam Family :కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. చొప్పదండి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన సీఎం, మేడిపల్లి సత్యం కుటుంబ సభ్యులను ఓదార్చారు. భార్య మరణంతో కుంగిపోయిన ఎమ్మెల్యే సత్యానికి ధైర్యం చెప్పారు. రెండు రోజుల కిందట ఎమ్మెల్యే సతీమణి రూపాదేవి సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది. ఆమె ఆత్మహత్యకు కారణాలు, అసలేం జరిగిందో మేడిపల్లి సత్యంను రేవంత్ రెడ్డి అడిగి వివరాలు తెలుసుకున్నారు.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను పరామర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి - CM Revanth Consoled MLA Satyam - CM REVANTH CONSOLED MLA SATYAM
CM Revanth Visited Choppadandi MLA Satyam : సతీవియోగంతో బాధపడుతున్న చొప్పదండి ఎమ్మెల్యే సత్యంను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లి, ఎమ్మెల్యేకు ధైర్యం చెప్పి పిల్లలను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే సత్యం సతీమణి రూపాదేవి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
![చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను పరామర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి - CM Revanth Consoled MLA Satyam CM Revanth Consoled MLA Satyam Family](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-06-2024/1200-675-21772520-thumbnail-16x9-cm-visit-choppadandi-mla.jpg)
CM Revanth Visited Choppadandi MLA Satyam (ETV Bharat)
Published : Jun 22, 2024, 8:13 PM IST
మేడిపల్లి సత్యం నివాసానికి వెళ్లిన సీఎం ఎమ్మెల్యేకి ధైర్యం చెప్పడంతో పాటు చిన్న పిల్లలను ఆయన ఓదార్చారు. అనంతరం ఎమ్మెల్యే సతీమణి రూపాదేవి చిత్రపటానికి పూలమాల వేసి సీఎం నివాళులు అర్పించారు. సీఎం వెంట ఆయన సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే సత్యంను పరామర్శించారు. ఇవాళ సాయంత్రం ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారయణ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులు సీఎం వెంట ఉన్నారు.