తెలంగాణ

telangana

ETV Bharat / state

వైభవంగా మల్లారెడ్డి మనవరాలి వివాహ మహోత్సవం - వేడుకలో స్పెషల్ అట్రాక్షన్​గా సీఎం రేవంత్ ​రెడ్డి - CM REVANTH REDDY WITH MALLA REDDY

ఘనంగా మల్లారెడ్డి మనవరాలి వివాహ మహోత్సవం - నవ వధువులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి రేవంత్ ​రెడ్డి, మంత్రులు పొన్నం, పోంగులేటి - వేడుకకు హాజరైన మాజీ మంత్రులు కేటీఆర్​, సబితా ఇంద్రారెడ్డి, బీఆర్​ఎస్​ నాయకులు

MALLA REDDY GRAND DAUGHTER WEDDING
CM Revanth Attend Malla Reddy Grand Daughter Wedding (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 27, 2024, 5:15 PM IST

Updated : Oct 27, 2024, 7:39 PM IST

CM Revanth Attend Malla Reddy Grand Daughter Wedding :మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మనవరాలు, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. హైదరాబాద్​ శివారు శంషాబాద్​లోని జీఎంఆర్ కన్వెన్షన్​లో ఆదివారం వివాహం జరగగా, ముఖ్యమంత్రి రేవంత్ ​రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్​, పొంగులేటి శ్రీనివాస్ ​రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. మాజీ మంత్రులు కేటీఆర్​, హరీశ్​రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్​ యాదవ్​, జగదీశ్​ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్​ రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్​, రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్​పర్సన్​ అనిత రెడ్డి, బీఆర్​ఎస్​ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

మల్లారెడ్డి మనవరాలి వివాహ మహోత్సవానికి కాంగ్రెస్​, బీఆర్​ఎస్, బీజేపీ నేతలు​ హాజరు కావడంతో వివాహ వేడుకలో ఉత్సాహం పెరిగింది. తన మనవరాలి వివాహానికి హాజరు కావాలంటూ పలువురు రాజకీయ నేతలను, ప్రముఖులను మల్లారెడ్డి ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు ఇవాళ జరిగిన వివాహ మహోత్సవానికి పలువురు ప్రముఖులు, పార్టీ నేతలు హాజరై, నూతన జంటను ఆశీర్వదించారు. మల్లారెడ్డి సైతం కుటుంబసభ్యులతో పాటు వివాహానికి వచ్చిన వారిని ఆప్యాతంగా స్వాగతించి వేదికపైకి తీసుకెళ్లారు.

మల్లారెడ్డి డీజే టిల్లు డ్యాన్స్​ : ఎప్పుడూ సోషల్​ మీడియో ట్రెండింగ్​లో ఉండే మాజీ మంత్రి మల్లారెడ్డి గత కొన్నిరోజులుగా మనవరాలు వివాహ పనుల్లో బిజీ అయ్యారు. ఈ నెల 22న మనవరాలి సంగీత్ ఫంక్షన్​లో డ్యాన్స్ చేసి మరోసారి సోషల్​ మీడియాను తనవైపు తిప్పుకున్నారు. సంగీత్ ఫంక్షన్​లో డీజే టిల్లు పాటలకు హుషారైన స్పెప్పులేస్తూ నెట్టింట వైరల్​గా మారారు. 75 ఏళ్ల వయసులోనూ అద్దిరిపోయే క్యాస్టూమ్స్​ ధరించి డీజే టిల్లు పాటకు స్టెప్పులేశారు.

మల్లారెడ్డి వేసిన డ్యాన్స్​ చూసి అక్కడున్న వారంతా ఫుల్ ఖుషీ అయ్యారు. దీంతో ఆ వీడియో కాస్త నెట్టింట తీగ వైరల్​గా మారింది. దీంతో నెటిజన్లు సైతం టిల్లన్న కంటే మల్లన్న డ్యాన్స్​ సూపర్​గా ఉందంటూ కామెంట్లు చేశారు.

అట్లుంటది మల్లారెడ్డితోని - మనవరాలి సంగీత్​లో అదరగొట్టే డ్యాన్స్

వైరల్​ వీడియో : మల్లారెడ్డి బతుకమ్మ డ్యాన్స్ - మీరూ చూడండి - Malla Reddy Dance with Students

Last Updated : Oct 27, 2024, 7:39 PM IST

ABOUT THE AUTHOR

...view details