తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగునీటి ప్రాజెక్టులపై తీర్మానానికి శాసనసభ ఆమోదం - రేపటికి వాయిదా - తెలంగాణ బడ్జెట్ సమావేశాలు 2024

Telangana Budget Sessions Today : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించొద్దని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది.

Telangana Budget Sessions Today
Telangana Budget Sessions Today

By ETV Bharat Telangana Team

Published : Feb 12, 2024, 4:36 PM IST

Updated : Feb 12, 2024, 5:07 PM IST

Telangana Budget Sessions Today :తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. అంతకుముందు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ(Projects Handover To KRMB)కి అప్పగించవద్దని ఉత్తమ్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి సభ్యులంతా ఆమోదం తెలపడంతో తీర్మానం ఆమోదం పొందినట్లు స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. అనంతరం శాసనసభ సమావేశాలు(Telangana Budget Sessions 2024) రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

KRMB Projects Bill in Telangana Assembly :అంతకుముందు మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ కృష్ణా నదీ జలాల్లో కేవలం 299 టీఎంసీలు చాలంటూ బీఆర్ఎస్ సర్కార్‌ మోసం చేసిందని ఆరోపించారు. దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసేందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల్లో అధిక వాటా ఇవ్వడమే కాక, రాయలసీమ ఎత్తిపోతలకు ఇతోధికంగా నాటి సీఎం కేసీఆర్‌ సాయపడ్డారంటూ ఉత్తమ్ (Uttam Speech On KRMB Projects Today) ఆక్షేపించారు.

సాగునీటి జలాలపై అసెంబ్లీలో హాట్ డిబేట్ - రేవంత్ Vs హరీశ్‌ వర్డ్ వార్

బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కృష్ణానది ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. అంతకుముందు ‘కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు.. బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలు’పేరుతో నోట్ విడుదల చేసింది. అనంతరం సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి(Presentation On Krishna Water Dispute) పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. కృష్ణా జలాల విషయంలో పదేళ్లలో జరిగిన తీరు తెన్నులను, గత ప్రభుత్వ తప్పిదాలను ఆయన సభకు సమగ్రంగా వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో కేసీఆర్‌ విఫలమయ్యారని ఆరోపించారు.

"కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదు. ఏపీకి కృష్ణా జలాలు వదిలేసిన కేసీఆర్ చాలా గొప్పవారని ఏపీ అసెంబ్లీలో జగన్ పొగిడారు. జల దోపిడీని అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తాం. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు సభ్యులు చేసిన సూచనలు, సలహాలు కచ్చితంగా స్వీకరిస్తాం. తెలంగాణకు జరగాల్సిన కేటాయింపులపై పోరాడతాం." - ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి

సాగునీటి ప్రాజెక్టులపై తీర్మానం ప్రవేశపెట్టే ముందుకు చివరలో మంత్రి ఉత్తమ్ మంగళవారం రోజున మేడిగడ్డ సందర్శన(All Party MLAs Medigadda Visit) గురించి మాట్లాడారు. మేడిగడ్డ సందర్శనకు సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నామని తెలిపారు. 'కాళేశ్వరం సందర్శనకు సభ్యులను ఆహ్వానిస్తున్నాం. సందర్శనకు రావాలని అందరికీ లేఖలు పంపాను. ఇది నా వ్యక్తిగత ఆహ్వానంగా భావించి అందరూ రావాలి' అని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కోరారు.

కృష్ణా ప్రాజెక్టులను కేఆర్​ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదు : మంత్రి ఉత్తమ్​

'కృష్ణా నదీ ప్రాజెక్టులపై వాస్తవాలు - కేసీఆర్‌ ప్రభుత్వ తప్పిదాలు' - అసెంబ్లీలో ప్రభుత్వం నోట్

Last Updated : Feb 12, 2024, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details