Telangana Budget Sessions 2024 :రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి రోజున ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ శాసనసభ, మండలిలో చర్చ జరగనుంది. ఉదయం ఉభయసభలు సమావేశం కాగానే నేరుగా చర్చ చేపడతారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రతిపాదిస్తారు. మరో సభ్యుడు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆ ప్రతిపాదనను బలపరుస్తారు. మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. మరో సభ్యుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆ ప్రతిపాదనను బలపరుస్తారు.
Governor Speech in Telangana Budget Sessions 2024 :అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CMRevanth Reddy) చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. గురువారం జరిగిన బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం ఉభయసభల ముందు ఉంచుతారు. అటు రాష్ట్ర మంత్రివర్గం మధ్యాహ్నం సమావేశం కానుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను శనివారం ప్రవేశపెడుతున్నారు. కేబినెట్లో పద్దుపై చర్చించి ఆమోదం తెలపనున్నారు.
గవర్నర్ ప్రసంగం పేలవంగా ఉంది - ప్రభుత్వం తన విజన్‌ను ఆవిష్కరించలేదు : హరీశ్‌రావు