Telangana Budget 2024-25 : వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళిక వారం రోజుల్లో వెల్లడి కానుంది. 2024-2025 తెలంగాణ బడ్జెట్‌ను వచ్చే శనివారం ఉభయ సభల్లో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. వార్షిక పద్దుపై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు ఇప్పటికే దాదాపుగా పూర్తయింది. అన్ని శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఆయా శాఖల మంత్రులు, అధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షించారు. శాఖల వారీ అవసరాలు, ప్రాధాన్యతలు, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ లక్ష్యాలు, ఆలోచనలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా కేటాయింపులు చేసే విషయమై అధికారులకు భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు.
Telangana Govt Exercise on Budget 2024 :కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెట్టినందున రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో స్పష్టత లభించింది. బడ్జెట్‌కు సంబంధించి తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆర్థికశాఖ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) చర్చించి పద్దుపై ఓ నిర్ణయానికి రానున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ముఖ్యమంత్రి ఆ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది.
బడ్జెట్‌పై సర్కార్ కసరత్తు - కేంద్రం నుంచి వచ్చే నిధుల ఆధారంగా కేటాయింపులు
Vote on Account Budget in Telangana 2024 :రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీల అమలుపైనే ఎక్కువగా దృష్టి సారించనుంది. 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామన్న దానికి అనుగుణంగా నిధులు కేటాయించనున్నారు. వాటితో పాటు ఇతర గ్యారంటీలు, ఉద్యోగ నియామకాలకు నిధులు ప్రతిపాదించనున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. తెలంగాణలోనూ అదే తరహాలోఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.