- సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బీసీలు వెనకబడి ఉన్నారు: తలసాని
- కేవలం సర్వే చేయించి, తీర్మానం చేస్తే సరిపోదు: తలసాని
- ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు చట్టబద్ధత కల్పించాలి
- ఏ కులం జనాభా ఎంత ఉందో ప్రభుత్వం వెల్లడిస్తే బాగుంటుంది
- ప్రొఫార్మాలో 56 అంశాలు ఉండటం వల్ల చాలామంది వివరాలు చెప్పలేదు
- ఫార్మాట్ సరళతరంగా మార్చి మరోసారి సర్వే చేయించాలి
- సర్వే ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి
LIVE UPDATES : అసెంబ్లీలో కులసర్వే నివేదిక ప్రవేశపెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి - TELANGANA ASSEMBLY SPECIAL SESSION
TELANGANA ASSEMBLY SPECIAL SESSION (ETV Bharat)
Published : Feb 4, 2025, 9:48 AM IST
|Updated : Feb 4, 2025, 3:16 PM IST
Telangana Assembly special session Live Updates ::శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డికులసర్వే నివేదిక ప్రవేశపెట్టారు. జనగణన కంటే పకడ్బందీగా కులగణన సర్వే చేశామని అసెంబ్లీలో ప్రకటించారు. సామాజిక ఆర్థిక సర్వే, ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికలపై చర్చే ప్రధాన అజెండాగా అసెంబ్లీ ఉభయ సభలు ఇవాళ సమావేశం అయ్యాయి.
LIVE FEED
- సర్వే ఆధారంగా ఆయా కులాల వారికి న్యాయం చేస్తాం: మంత్రి పొన్నం
- తెలంగాణ ప్రభుత్వం చేయించిన సర్వే దేశానికే దిక్సూచిగా నిలుస్తుంది
- భవిష్యత్‌లో చేపట్టే కార్యక్రమాలకు ఈ సర్వే రోడ్‌మ్యాప్ లాంటిది
- భావితరాలకు న్యాయం చేయటానికి సమగ్రంగా వివరాల సేకరణ జరిగింది
- బీసీలకు న్యాయం చేసేందుకు చేపట్టాల్సిన పథకాలపై విపక్షాలు సూచనలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం
- జనగణన కంటే పకడ్బందీగా కులగణన సర్వే చేశాం: సీఎం
- రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి స్టిక్కర్ అతికించారు: సీఎం
- ఒక ఎన్యుమరేటర్ రోజుకు 10 ఇళ్ల కంటే ఎక్కువ ఇళ్లు సర్వే చేయలేదు
- 8 పేజీలతో ఉన్న ప్రశ్నపత్రంలో సమగ్ర వివరాలు నమోదు చేశాం
- 76 వేల మంది డేటాఎంట్రీ ఆపరేటర్లు 36 రోజుల పాటు డేటా క్రోడీకరించారు
- రూ.125 కోట్లు ఖర్చు చేసి సమగ్రమైన వివరాలు సేకరించాం
- నిర్ణయం తీసుకున్న ఏడాదిలోపే పకడ్బందీగా సర్వే చేయించాం
- ఈ సర్వే భవిష్యత్‌లో మైలురాయిగా నిలుస్తుంది
- ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ, ఉపాధి పథకాలకు ఇది దిక్సూచిగా నిలుస్తుంది
- 56 శాతంపైగా ఉన్న బీసీలకు సముచిత గౌరవం కల్పించాలి
- కులసర్వేలో పాల్గొన్న అందరినీ రాజకీయాలకతీతంగా అభినందించాలి
- అసెంబ్లీలో కులసర్వే నివేదిక ప్రవేశపెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి
- సర్వే ప్రకారం ఎస్సీలు 61,84,319 మంది ఉన్నారు: సీఎం
- సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎస్సీలు 17.43 శాతంగా ఉన్నారు: సీఎం
- బీసీలు (ముస్లిం మైనార్టీ మినహా) 46.25 శాతంగా ఉన్నారు: సీఎం
- బీసీలు (ముస్లిం మైనార్టీ మినహా) 1,64,09,179 మంది ఉన్నారు: సీఎం
- ఎస్టీలు 37,05,929 మంది 10.45 శాతంగా ఉన్నారు: సీఎం
- ముస్లిం మైనార్టీలు 44,57,012 మంది 12.56 శాతంగా ఉన్నారు: సీఎం
- ముస్లిం మైనార్టీల్లో బీసీలు 35,76,588 మంది 10.08 శాతంగా ఉన్నారు: సీఎం
- ముస్లిం మైనార్టీల్లో ఓసీలు 8,80,424 మంది 2.48 శాతంగా ఉన్నారు: సీఎం
- ఓసీలు 56,01,539 మంది 15.79 శాతంగా ఉన్నారు: సీఎం
- శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాలు ప్రారంభం
- కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై శాసనసభలో చర్చ
- ఉభయసభల ముందుకు సామాజిక, ఆర్థిక సర్వే నివేదికలు
- కులగణన, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన
- కులగణన, ఎస్సీ వర్గీకరణపై మండలిలో భట్టి విక్రమార్క ప్రకటన
- నాడు ప్రతిపక్షంలో ఉన్నా సిద్ధం కాలేదు: హరీశ్‌రావు
- నేడు పాలకపక్షంలో ఉన్నా సిద్ధం కాలేదు: హరీశ్‌రావు
- సభాపతితో సమావేశమైన కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- శాసనమండలి వాయిదా వేయాలని కోరిన మంత్రి కొండా సురేఖ
- మంత్రివర్గ భేటీ దృష్ట్యా మండలి వాయిదా వేయాలని కోరిన సురేఖ
- మండలిని మధ్యాహ్నం 2 గం.కు వాయిదా వేసిన ఛైర్మన్
- శాసనసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా
- మంత్రివర్గ భేటీ దృష్ట్యా సభ వాయిదా వేయాలని కోరిన శ్రీధర్‌బాబు
- మినిట్స్, నోట్ తయారీకి సమయం పడుతుందన్న శ్రీధర్‌బాబు
- శాసనసభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసిన సభాపతి
- శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాలు ప్రారంభం
- కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై శాసనసభలో చర్చ
- ఉభయసభల ముందుకు సామాజిక, ఆర్థిక సర్వే నివేదికలు
- కులగణన, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ప్రకటన చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
- కులగణన, ఎస్సీ వర్గీకరణపై మండలిలో ప్రకటన చేయనున్న భట్టి విక్రమార్క
- స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పనపై తీర్మానం
- ఇప్పటికే సామాజిక, ఆర్థిక సర్వే వివరాలను వెల్లడించిన మంత్రివర్గ ఉపసంఘం
- ఎస్సీ వర్గీకరణపై ఉపసంఘానికి ఇప్పటికే నివేదిక అందజేసిన ఏకసభ్య కమిషన్
- ఎస్సీ ఉపకులాలను 4 కేటగిరీలుగా విభజించాలని సిఫారసు చేసినట్లు సమాచారం
- ఏకసభ్య కమిషన్ సిఫారసులపై ఉభయసభల్లో చర్చించి ఆమోదించే అవకాశం
సామాజిక, ఆర్థిక సర్వే నివేదికకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం
- సామాజిక, ఆర్థిక సర్వే నివేదికకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం
- ఎస్సీ వర్గీకరణపై నివేదికకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం
- అనంతరం శాసనసభ ముందుకు సామాజిక, ఆర్థిక సర్వే నివేదికలు
మంత్రి హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తాం - ఆందోళనకారులు
- హైదరాబాద్: మంత్రుల నివాస ప్రాంగణం వద్ద ధర్నా
- వీఆర్‌ఏల కుటుంబసభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్
- మిగిలిన 3,797 మంది వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్
- మంత్రి హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామన్న ఆందోళనకారులు
- పోలీసులు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట
- రెండు విడతల్లో ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- మంత్రుల నివాస ప్రాంగణం వద్ద భారీ పోలీసు బందోబస్తు
వీఆర్‌ఏల కుటుంబసభ్యులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని నిరసన
- హైదరాబాద్: మంత్రుల నివాస ప్రాంగణం వద్ద ధర్నా
- వీఆర్‌ఏల కుటుంబసభ్యులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని నిరసన
- ఆందోళనకు దిగిన కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- మరోసారి మినిస్టర్స్ క్వార్టర్స్ వద్దకు వచ్చిన ఆందోళనకారులు
- మంత్రుల నివాస ప్రాంగణం వద్ద భారీ పోలీసు బందోబస్తు
- తమ సమస్యలపై మంత్రివర్గ భేటీలో చర్చించాలని డిమాండ్
నేడు శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాలు
- నేడు శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాలు
- కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై శాసనసభలో చర్చ
- ఉదయం 11 గంటలకు శాసనసభ, మండలి సమావేశం
- ఇవాళ ఉభయసభల ముందుకు సామాజిక, ఆర్థిక సర్వే నివేదికలు
- కులగణన, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ప్రకటన చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
- కులగణన, ఎస్సీ వర్గీకరణపై మండలిలో ప్రకటన చేయనున్న భట్టి విక్రమార్క
- స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పనపై తీర్మానం
- ఇప్పటికే సామాజిక, ఆర్థిక సర్వే వివరాలను వెల్లడించిన మంత్రివర్గ ఉపసంఘం
- ఎస్సీ వర్గీకరణపై ఉపసంఘానికి ఇప్పటికే నివేదిక అందజేసిన ఏకసభ్య కమిషన్
- ఎస్సీ ఉపకులాలను 4 కేటగిరీలుగా విభజించాలని సిఫారసు చేసినట్లు సమాచారం
- ఏకసభ్య కమిషన్ సిఫారసులపై ఉభయసభల్లో చర్చించి ఆమోదించే అవకాశం
Last Updated : Feb 4, 2025, 3:16 PM IST