Telangana Assembly And Council Postponed :తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదా పడ్డాయి. 11 గంటలకు సభ ప్రారంభం కాగానే అసెంబ్లీ వ్యవహారల మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మంత్రివర్గ భేటీ దృష్ట్యా సమావేశాలు, మినిట్స్, నోట్ తయారీకి సమయం పడుతుందన్న వాయిదా వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కోరారు. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేశారు. సభాపతితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు.
మరోవైపు శాసమమండలి వాయిదా వేయాలని మంత్రి కొండా సురేఖ కోరారు. మంత్రివర్గ భేటీ దృష్ట్యా మండలి వాయిదా వేయాలని కోరగా ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వాయిదా వేశారు. కౌన్సిల్ తిరిగి 2గంటలకు ప్రారంభం కానుంది.