ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదర్శ ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం - పాఠశాలలో విగ్రహం ఏర్పాటు - Teacher Statue Set Up in School - TEACHER STATUE SET UP IN SCHOOL

Teacher Statue Set Up in School: పాఠశాలలోని ఉపాధ్యాయుడు అంటే కేవలం పాఠాలు బోధించడానికే పరిమితం కాలేదు. తాను పనిచేస్తున్న పాఠశాల అభివృద్ధికి, అక్కడి విద్యార్థుల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశార ఓ ఉపాధ్యాయుడు. ఈ క్రమంలో ఆయన చేసిన సేవలకు పాఠశాలలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేసి నాటి సేవలను స్మరించుకుంటున్నారు శ్రీకాకుళం జిల్లాలోని బోరుభద్ర గ్రామస్థులు.

teacher_statue_at_school.
teacher_statue_at_school. (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2024, 10:00 PM IST

Teacher Statue Set Up in School:ఉపాధ్యాయుడు అంటే ఆయన కేవలం తరగతి గదిలో పాఠాలు బోధించడానికే పరిమితం కాలేదు. తాను పనిచేస్తున్న పాఠశాల అభివృద్ధికి, అక్కడి విద్యార్థుల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారు. సముద్ర తీరప్రాంతం నుంచి పాఠశాలకు రాలేని విద్యార్థులకు అవరోధంగా ఉన్న సమస్యలను నాటి పాలకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలు చూపారు.

ఓవైపు ఉపాధ్యాయుడిగా, మరోవైపు వైద్యుడిగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎనలేని సేవలు అందించి అందరి మనసుల్లో నిలిచిపోయారు. ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని సైతం అందుకున్నారు. ఆయన తదనంతరం 22 ఏళ్ల తర్వాత ఆపాఠశాల ఆవరణలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేసి నాటి సేవలను స్మరించుకుంటున్నారు ఆ గ్రామస్థులు.

ఉన్నత పాఠశాలను తీసుకురావడంలో విశేష కృషి:శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం బోరుభద్ర గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేసిన దివంగత ఉపాధ్యాయుడు మణిపాత్రుని నరసింహమూర్తి విగ్రహాన్ని పాఠశాల ఆవరణలో ఆగస్టు 15న ఏర్పాటు చేశారు. పాఠశాల వ్యవస్థాపకుడు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత అయిన ఈయన 1975లో ఈ ప్రాంతానికి ఉన్నత పాఠశాలను తీసుకురావడంలో విశేష కృషి చేశారు.

అప్పటి వరకు ఉన్నతపాఠశాల విద్య కోసం 8 కిలోమీటర్ల దూరంలోని మండల కేంద్రానికి వెళ్లి చదువుకోవాల్సి వచ్చేది. ఆయన చేసిన సేవలకు 1988లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందజేసింది. కేవలం ఐదుగురు ఉపాధ్యాయులతో పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలోనే బోరుభద్ర ఉన్నతపాఠశాలను ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్దారు.

'తిరుమల లడ్డూలపై అసత్య ప్రచారం నమ్మొద్దు'- ఇకపై వారికి ఆధార్ ఉంటేనే! - Illegal Laddu Sales in TTD

గ్రామాల్లో తిరుగుతూ వైద్యం: సముద్ర తీరప్రాంతం నుంచి వాగులు, కాలువలు, పొలం గట్లు దాటి చదువు కోసం వస్తున్న ఎంతో మంది విద్యార్థుల కష్టాల్ని తీర్చేందుకు నాటి ప్రజాప్రతినిధుల్ని నిరంతరం కలుస్తూ సమస్యల గురించి నరసింహమూర్తి విన్నవించేవారు. తీరప్రాంత గ్రామాల రహదారులు, గరేబల్లి గెడ్డపై వంతెన నిర్మాణానికి, బీసీ సంక్షేమ వసతిగృహ ఏర్పాటు ఆయన కృషి వలనే మంజూరయ్యాయని గ్రామస్థులు చెబుతున్నారు. ఆయన స్మారకార్థం పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ చూపుతున్న మొదటి ముగ్గురు విద్యార్థులకు వారి కుటుంబసభ్యులు నగదు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ఇటీవల ప్రకటించారు. గ్రామాల్లో తిరుగుతూ వైద్యం అందించే వారని, నాడు ఆయన చూపిన చొరవ వలనే తాము ఉన్నత చదువులు చదువుకోగలిగామని పూర్వవిద్యార్థులు చెబుతున్నారు.

మణిపాత్రుని నరసింహమూర్తి పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉంటూ గ్రామంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశారు. అంతే కాకుండా పాఠశాలలో విధ్యార్థులను చేరుస్తూ, పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషిచేశారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని పాఠశాలలో పెట్టడం చాలా సంతోషకరంగా ఉంది.-పాగోటి రామకృష్ణారావు, ప్రధానోపాధ్యాయుడు

నేను పూర్వం ఇక్కడ చదువుకునే సమయంలో ఎలాంటి వసతులు ఉండేవి కావు. చుట్టు పక్క ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం కూడా ఉందేది కాదు. అంతే కాకుండా మేము చదువుకునే రోజుల్లో 6వ తరగతి వరకే ఉండేది. ఆ తరువాత నరసింహమూర్తి కృషి వల్ల మా గ్రామానికి ఉన్నత పాఠశాల వచ్చింది.-ఆరంగి రామారావు, పూర్వవిద్యార్థి

ఏంది బ్రో ఈ బొక్కలో పంచాయితీ? - పెళ్లిలో మటన్ ముక్కల కోసం ఫైట్ - Mutton Fight in Navipet

గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం - ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ - Pension Distribution in AP

ABOUT THE AUTHOR

...view details