ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్కూల్​కు వెళ్లనని చిన్నారి మారాం - అసలు విషయం తెలుసుకొని తల్లి షాక్​! - Teacher Misbehaved With Girl - TEACHER MISBEHAVED WITH GIRL

Teacher Misbehaved With Girl in Krishna District : విద్యాబుద్ధులు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువే కీచకుడిలా మారాడు. ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తనతో స్కూల్​కు వెళ్లానంటూ చిన్నారి మారాం చేసింది. దీంతో చిన్నారిని తల్లి ప్రశ్నించడంతో ఈ సంఘటన వెలుగుచూసింది.

TEACHER MISBEHAVED WITH GIRL
TEACHER MISBEHAVED WITH GIRL (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 27, 2024, 9:11 AM IST

Teacher Misbehaved With Girl in Krishna District :చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. గుడివాడ మండలంలో ‘సార్‌ నన్ను రోజూ బ్యాడ్‌ టచ్‌ చేస్తున్నారు. బడికి వెళ్లను’ అని ఓ చిన్నారి మారాం చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. ఉపాధ్యాయుడు వికృత చేష్టలకు ఆ చిన్నారి కొంతకాలంగా తీవ్ర వేదనకు గురయ్యింది. స్కూల్​కి వెళ్లాలంటేనే భయంతో మొండికి వేస్తుంది. తల్లిదండ్రులు బతిమాలి, బెదిరించి ఆ చిన్నారిని స్కూల్​కి పంపిస్తున్నారు.

లెక్చరర్​ అసభ్య ప్రవర్తన: దేహశుద్ధి చేసిన విద్యార్థులు

టీచర్​ వెకిలి చేష్టలను ఇంట్లో చెప్పలేక ఇంట్లోనే ఓ మూల కూర్చొని చిన్నారి రోదిస్తోంది. దిగాలుగా ఉన్న చిన్నారిని గురువారం ఉదయం (sep 26) ఎందుకు బడికి వెళ్లనంటున్నావని చిన్నారిని తల్లి ప్రశ్నించింది. ఈ క్రమంలో చిన్నారి ఏడుస్తూ తల్లికి అసలు విషయం చెప్పింది. గుడివాడ మండలం చౌటపల్లి గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎం.చంద్రశేఖర్‌ (42) వ్యాయామ ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. ఆయన కొంతకాలంగా నాలుగో తరగతి విద్యార్థినిని అసభ్యంగా తాకుతున్నాడని, దీంతో బడికి వెళ్లాలంటే భయపడుతోందని చిన్నారి తల్లి గుడివాడ రూరల్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. రూరల్​ ఎస్సై ఎన్‌.చంటిబాబు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై చేయి చేసుకున్న డిప్యూటీ తహసీల్దార్ - వీడియో వైరల్

'టీచర్లు బూతులు తిడుతున్నారు- అమ్మాయిలను అసభ్యంగా పిలుస్తున్నారు' - Students Complaint on Teacher

ABOUT THE AUTHOR

...view details