తెలంగాణ

telangana

ఏపీ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల - జులై 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ - AP TET Notification

By ETV Bharat Telangana Team

Published : Jul 1, 2024, 8:58 PM IST

AP TET Notification 2024 Updates : ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విడుదలైంది. జులై 2 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్‌లైన్‌లో జరగనున్న ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను cse.ap.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ అధికారులు సూచించారు.

AP TET Notification Updates
AP TET Notification Updates (ETV Bharat)

AP TET Notification Release on July 1st : ఏపీలో సోమవారం (జులై 1)న టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించి జులై 2 నుంచి దరఖాస్తుల స్వీకరించనుంది. నోటిఫికేషన్‌, ఇన్ఫర్మేషన్‌ బులెటిన్‌, షెడ్యూల్‌, సిలబస్‌తో పాటు ఆన్‌లైన్‌లో జరిగే ఈ పరీక్షపై అభ్యర్థులకు తగిన సూచనలు, విధివిధానాలను విద్యాశాఖ ఖరారు చేసింది.

Andhra Pradesh TET Notification 2024 Updates :ఈ సమాచారాన్ని జులై 2 నుంచి https://cse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అదనపు సమాచారం కోసం కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించవచ్చని ఆయన సూచించారు.

ఇటీవల ఏపీలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6వరకు గత ప్రభుత్వం టెట్​ను నిర్వహించింది. ఈ పరీక్షకు 2.35లక్షల మంది హాజరైతే, వారిలో 1,37,903 మంది (58.46శాతం) అర్హత సాధించారు. అయితే, కొత్త ప్రభుత్వం పాత డీఎస్సీని రద్దు చేసి, కొత్తగా 16,347 టీచర్‌ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా బీఈడీ, డీఎడ్‌ పాసైన అభ్యర్థులతో పాటు ఇటీవల ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఫెయిలైన వారికి అవకాశం కల్పిస్తూ కొత్తగా టెట్‌ నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20శాతం వెయిటేజీ ఉంటుంది. ఇందులో భాగంగా పేపర్​-1 రాయాలంటే డీఈడీ అర్హత ఉండాలి. పేపర్​-2 రాయాలంటే డిగ్రీ, బీఈడీ చదివి ఉండాలి.
టెట్​ అభ్యర్థులకు అలర్ట్​ - వెబ్​సైట్​లో "మాక్​ టెస్ట్​ ఆప్షన్​"! ప్రాసెస్​ ఇదే! - TS TET Free Mock Test 2024

AP DSC Notification Cancelled 2024 : మరోవైపు గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ ప్రకటనను రద్దు చేస్తూ ఇప్పటికే విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌లో 6,100 టీచర్‌ పోస్టులు మాత్రమే ఉన్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ, కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

టెట్‌ అర్హత సాధించని వారికి మంత్రి లోకేశ్‌ గుడ్ న్యూస్‌ - వారికి మళ్లీ పరీక్ష పెడతారంటా - Minister Nara Lokesh on TET Result

ABOUT THE AUTHOR

...view details