TDP Released Sharmila Letter to Jagan: ఆంధ్రప్రదేశ్‌లో వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మధ్య ఆస్తి పంపకాలపై మొదలైన వివాదం మరో మలుపు తిరిగింది. జగన్ తీరును విమర్శిస్తూ, ఆయన వ్యవహారశైలి, ఆస్తి కోసం ఎలా ఇబ్బందులు పెడుతున్నాడో తెలుపుతూ షర్మిల గతంలో రాసిన లేఖ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఓ లేఖను అధికార తెలుగుదేశం పార్టీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసింది.
జగన్ ఈ ఏడాది ఆగస్ట్27నే షర్మిలకు లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి తనను రాజకీయంగా అడ్డుకుంటున్నారని, అసలు షర్మిలకు ఆస్తులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. తనను రాజకీయంగా ఇబ్బందులు పెడుతున్నందుకు నీకు, చిల్లి గవ్వ ఇవ్వనని లేఖలో తేల్చిచెప్పారు. తల్లి విజయమ్మ,నీ మీద కేసు వేస్తున్నానని బెదిరింపు ధోరణిలో జగన్ ఈ లేఖ రాశారు. దానికి కౌంటర్‌గా సెప్టెంబరు 12న జగన్‌కు షర్మిల 8 అంశాలతో లేఖ రాసింది. తెలుగుదేశం పార్టీ ఇప్పుడా లేఖనే ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ లేఖ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
లేఖలో షర్మిల ఏం చెప్పారంటే?