ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కౌంటింగ్‌ రోజు వైఎస్సార్సీపీ హింసకు పాల్పడే ప్రమాదం ఉంది: టీడీపీ నేతలు - TDP Leaders on YSRCP Anarchy - TDP LEADERS ON YSRCP ANARCHY

TDP Leaders Fires on YSRCP Anarchy: చంద్రబాబు మరోసారి సీఎం కావడం పోలింగ్‌ రోజే నిర్ణయమైందని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఓటమి నైరాశ్యంలో కౌంటింగ్‌ రోజు వైసీపీ హింసకు పాల్పడే ప్రమాదం ఉందని అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అయిన వారికి ముఖ్య పదవులు కట్టబెట్టేందుకు సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు.

tdp_leaders_on_ysrcp_anarchy
tdp_leaders_on_ysrcp_anarchy (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 25, 2024, 3:46 PM IST

TDP Leaders Fires on YSRCP Anarchy:జగన్ రెడ్డి కనుసన్నల్లో అయిన వారికి ఐఏఎస్ పదవులు కట్టబెట్టేందుకు సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలు కుయుక్తులు పన్నుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అడ్డగోలుగా లిస్ట్ తయారు చేసి సొంత జిల్లాల వారికి పదువులు కట్టబెట్టేందుకు ప్లాన్ వేస్తున్నారని మండిపడ్డారు. జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్​కు విరుద్ధమని తెలిపారు. అర్హత ఉన్నవారికి తెలియకుండా నోటిఫికేషన్ జారీ చేశారని ఉమా విమర్శించారు.

అక్రమ నియామకాలను అడ్డుకోవాలని సీఈసీని, సంబంధిత అధికారులను చంద్రబాబు కోరారని తెలిపారు. బోగాపురంలో రిజల్ట్​కు ముందే పేదల భూములు కొట్టేసేందుకు ప్లాన్ వేశారని తెలిపారు. రాష్ట్రంలో రక్తపాతానికి సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలు, వారి డైరెక్షన్​లో నడిచిన అధికారులే కారణమని ఆరోపించారు. అరాచకాలు సృష్టించి సిగ్గులేకుండా టీడీపీపై బురద చల్లేందుకు జోగి రమేష్, అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలు యత్నిస్తున్నారని దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.

విశాఖలో అసైన్డ్ భూములపై సీఎస్ కన్ను - రూ.2 కోట్లు పలికే భూములు ఐదారు లక్షలకే: మూర్తియాదవ్‌ - Murthy Yadav Allegations on CS

వైసీపీ మరోసారి హింసకు పాల్పడే అవకాశం ఉంది:వైఎస్సార్​సీపీ మళ్లీ గెలుస్తుందని సొంతపార్టీ వాళ్లు కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు (Prattipati Pullarao) విమర్శించారు. జూన్‌ 4 తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు స్థానికంగా ఎవరు ఉండకపోవచ్చని అన్నారు. కూటమే విజయం ఖాయమని సర్వేలన్నీ ముక్తకంఠంతో చెబుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మరోసారి సీఎం కావడం పోలింగ్‌రోజే నిర్ణయమైందని అన్నారు. ఓటమి నైరాశ్యంలో కౌంటింగ్‌ రోజు వైసీపీ హింసకు పాల్పడే ప్రమాదం ఉందని అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కుట్రలో భాగంగానే పీఎస్‌లలో కెమెరాలు పని చేయకుండా చేస్తున్నారని అన్నారు. కావాలనే సీసీ కెమెరా సేవలకు బిల్లులు చెల్లించకుండా ఈ పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. వైసీపీ రౌడీరాజ్యంపై సాక్షాల్లేకుండా చేయాలనే సీసీ కెమెరాలపై కుట్రల పన్నారని అన్నారు. ఈసీ తక్షణం జోక్యం చేసుకుని సీసీ కెమెరా వ్యవస్థ మొత్తం పనిచేసేలా చూడాలని కోరారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా జూన్‌ 4న వారి ఓటమిని ఎవరూ అడ్డుకోలేరని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వివాదంలో చర్యలు- ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు - Two Constables Suspended

పోలీసులు వైసీపీ ప్రభుభక్తిని వీడాలి:కారంపూడి సీఐపై హత్యాయత్నం కేసులో పిన్నెల్లిని ఎందుకు అరెస్టు చేయట్లేదని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు (GV Anjaneyu) ప్రశ్నించారు. పోలీసునే చంపబోయిన వ్యక్తి ముందు అధికారులు ఎందుకు సాగిలబడుతున్నారని మండిపడ్డారు. పిన్నెల్లికి హైకోర్టు రక్షణ కల్పించింది ఈవీఎం ధ్వంసం కేసులో మాత్రమేనని గుర్తు చేశారు. విధుల్లోని సీఐని కొట్టి గాయపరిచినా అరెస్టుకు ఎందుకంత భయమని అన్నారు. రాష్ట్రమంతా ముక్కున వేలేసుకుంటున్నా పోలీసుల్లో కనీస చలనం లేదని విమర్శించారు. పోలీసులు వైసీపీ ప్రభుభక్తిని పక్కనపెట్టకపోతే కౌంటింగ్‌ రోజు ప్రజలకు ఎవరు రక్షణగా ఉంటారని జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు.

ఓటమి భయంతోనే వైసీపీ దాడులకు పాల్పడుతుంది:సీఎం జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు సజావుగా జరుగుతుందన్న నమ్మకం లేదని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రవణ్‌(Tenali Shravan) అన్నారు. వైసీపీ నేతలు ఓటమి భయంతోనే రాష్ట్రంలో పలుచోట్ల దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. రాష్ట్రంలో జరిగిన వరుస పరిణామల దృష్ట్యా ఎన్నికల కమిషన్ వెంటనే ప్రభుత్వ సలహాదారు జవహర్ రెడ్డిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

వర్షాకాలం ముంచుకొచ్చినా చలనం లేదా?- అస్తవ్యస్త డ్రైనేజీలతో నగరాల్లో అవస్థలు - DRAINAGE PROBLEM

ABOUT THE AUTHOR

...view details