TDP Leaders Complain to CEO : రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలయ్యాక కూడా అధికార పార్టీ దాడులు ఆగడం లేదని తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. కొందరు అధికారులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్రప్రజలందరికీ జవాబుదారీ అని కేవలం వైసీపీకి మాత్రమే కాదని టీడీపీ నేతలు విమర్శించారు. రాష్ట్రంలో జరిగిన వివిధ హింసాత్మక ఘటనలపై చర్యల కోసం డీజీపీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నా ఆయన ప్రతిపక్ష నేతలు ఎవరికికీ అపాయింట్ మెంట్ ఇవ్వటం లేదని ఆరోపించారు. అందుకే ఆయనకు ఇవ్వాల్సిన వినతి పత్రాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఇచ్చామని తెలుగుదేశం పార్టీ నేత వర్లరామయ్య స్పష్టం చేశారు.
పోలింగ్ ఏజెంట్లుగా పని చేయకూడదనే కుట్ర- టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు: ఈసీకి టీడీపీ ఫిర్యాదు
ఈ సందర్భంగా వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇప్పటికి చాలా మంది పోలీసు అధికారులు అధికార పార్టీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వారంతా పోలీసు మాన్యువల్ ప్రకారం, రాజ్యాంగబద్దంగా వ్యవహరించాలని కోరుతున్నా వారిలో మార్పు రావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో లక్ష్మణ్, భక్తవత్సల రెడ్డి అనే ఇద్దరు సీఐలు దారుణంగా వ్యవహరిస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఎన్నికల సీఈఓకి ఫిర్యాదు చేశారు.
TDP Leaders Fire on YCP Government : ఎమ్మెల్యేతో పాటు వారి కుటుంబాలకూ సీఐలు సెల్యూట్ చేయటం శోచనీయమని అన్నారు. పోలీసులు రూల్స్ ప్రకారం నడిస్తే ఎటూవంటి సమస్య లేదు. అంతేకాని వైసీపీ నాయకులు చెప్పినట్టు వింటూ ప్రతిపక్షలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ప్రజా తీర్పుతో ఎన్నికైన ఎమ్మెల్యేకు పోలీసులు సెల్యూట్ చేయటం, అతని కారుడోర్ తీయటం ఇది వరకు చూశాం. కానీ ఎమ్మెల్యే కుమారుడికి, భార్యకు సైతం సెల్యూట్లు కొట్టాడం ఏంటని ప్రశ్నించారు. అలాంటి పోలీసులు ప్రజలకు ఏం న్యాయం చేస్తారన్నారని మండిపడ్డారు. ఈ ఇద్దరు సీఐలు వైసీపీ నేతలు చెప్పిందే చేస్తారని అక్కడి ప్రజాలంతా చెబుతున్నారు. అలాంటి పోలీసులు అధికారులను ఎన్నికల విధుల నుంచి తక్షణం తొలగించాలని ఎన్నికల అధికారిని కోరామని వర్ల రామయ్య తెలిపారు.
తిరుపతిలో 36 వేల దొంగ ఓట్లు - సీఈవోకు బీజేపీ ఫిర్యాదు - BJP Complain to CEO
అలాగే వాలంటీర్లు రాజీనామా చేస్తే పోలింగ్ ఏజెంట్లుగా పెట్టుకుంటామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని ఇదెక్కడి విడ్డూరమని అన్నారు. అసలు జగన్ వాలంటీర్లను పెట్టుకోవడనే పెద్ద దురుద్దేశంలో పెట్టుకున్నారు. వారీ ద్వారా రాజకీయ లబ్ధిపోందాలనే కుట్రతోనే వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారని మండిపడ్డారు. అదేవిధంగా సీఎం జగన్పై పోటీ చేస్తున్న బీటెక్ రవికి రక్షణ కల్పించమంటే పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. బీటెక్ రవికి గన్‌మెన్లు ఇవ్వమని అంటే ఆయనకు ఎటువంటి ప్రాణభయం లేదని కడప ఎస్పీ రిపోర్టు ఇచ్చారన్నారు. పులివెందులలో ప్రాణభయం లేదంటే రాష్ట్రమంతటా ఎవరికీ గన్‌మెన్లు అక్కర్లేదని, అంతటా ప్రశాంతంగా ఉన్నట్టేనని విమర్శించారు. ఎన్నికల్లో సమాన అవకాశాలు కల్పించకపోతే ప్రతిపక్షాలు ఎలా ఎన్నికల్లో పాల్గొంటాయని వర్ల రామయ్య మండిపడ్డారు.
కోడ్ పటిష్ఠంగా అమలు చేయాలి - ఎన్నికల ఉచితాలపై ఉక్కుపాదం మోపాలి: ఎం.కె. మీనా
ప్రతి పక్షనేతలకు డీజీపీ అపాయింట్ మెంట్ ఇవ్వటం లేదు - అందుకే రాష్ట్రంలోని దారుణాలను సీఈఓకి ఫిర్యాదు చేశాం : టీడీపీ నేతలు