TDP Janasena Leaders Criticized Jagan:సీఎం జగన్బీసీలను మోసం చేశారని జయహో బీసీ కార్యక్రమంలో టీడీపీ - జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లకి మోసే బీసీలను పల్లకి ఎక్కించి గౌరవించిన నేత ఎన్టీఆర్ అని శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు కొనియాడారు. బీసీలకు విద్యా ఉపాధి అవకాశాలు కల్పించిన నేత చంద్రబాబు అని పేర్కొన్నారు. తన బీసీలు అని చెప్పుకునే హక్కు ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంది తప్పా, జగన్ కు ఎంత మాత్రం లేదని తేల్చిచెప్పారు.
బీసీ కార్పొరేషన్లకు కుర్చీలు లేవు: రాజకీయ పార్టీల భవిష్యత్తును శాసించేది బీసీలేనని పితాని సత్యనారాయణ అన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు మొదట్నుంచీ అండగా నిలిచిందని పేర్కొన్నారు. బీసీలకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, కానీ సీఎం జగన్ మాత్రం 56 కార్పొరేషన్ల పేరుతో బీసీలను మోసం చేశారని ఆరోపించారు. బీసీ కార్పొరేషన్లకు కుర్చీలు లేవు, నిధులు లేవని పితాని ఎద్దేవా చేశారు. సీఎం జగన్కు మీడియా సమావేశం పెట్టే ధైర్యం లేదని పితాని విమర్శలు గుప్పించారు.
వెనకబడిన వర్గాల్లో జగన్ చిచ్చు: వైఎస్సార్సీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి, జనసేన నేత కొణతాల రామకృష్ణ అన్నారు. ఒక్క అవకాశమని వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. వెనుకబడిన వర్గాల్లో జగన్ చిచ్చు పెడుతున్నారని కొణతాల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను రాజకీయ నేతలుగా చేసిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుందని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ పరిపాలనలో బీసీ నేతలను భయపెట్టి వేధిస్తున్నారని కొణతాల ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగడం లేదని విమర్శించారు. భూములు ఇచ్చిన అమరావతి రైతులను రోడ్డుపైకి తెచ్చారని కొణతాల ఆవేదన వ్యక్తం చేశారు.
వాలంటీర్లను తొలగించం- వివేక హత్యపై పూటకోమాట! చర్చకు సిద్దమా ?: చంద్రబాబు
బీసీ యువత భవిష్యత్తును నాశనం:సమాజంలో సగానికి పైగా బీసీలమే ఉన్నామని కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. చంద్రబాబుకు అండగా ఉండాల్సిన అవసరం వచ్చిందని ప్రజలకు కాలవ పిలుపునిచ్చారు. దుర్మార్గమైన వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన మసయం వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రం వైపు చూడకుండా జగన్‌ను తరిమేయాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. జగన్ బీసీ యువత భవిష్యత్తును నాశనం చేశారని కాలవ ఆగ్రహం వ్యక్తం చేశారు.