TDP Jana Sena BJP Leaders Campaigning in AP :ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల అభ్యర్థులు జోరుగా పాల్గొంటున్నారు. తెలుగుదేశం మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని నేతలు భరోసా ఇస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ కూటమి మేనిఫెస్టోను వివరిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు.
అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు అందించాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నారా లోకేష్‌కు మద్దతుగా తాడేపల్లిలో ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి లోకేష్‌ను గెలిపించాలని కోరారు. కూటమి మేనిఫెస్టో, తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య రోడ్ షో నిర్వహించారు. మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని సౌమ్యకు మద్దతు పలికారు. ఇంటింటికి తిరిగి సైకిల్ గుర్తుపై ఓటు వేసి సౌమ్యను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ కరపత్రాలు పంచారు. బాపట్లలో కూటమి అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ ప్రచారం చేశారు. స్థానిక మహిళలు ఆయనకు హారతులిచ్చి, పూల దండలు వేసి స్వాగతం పలికారు. నరేంద్రవర్మ రోడ్‌షోకు మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
ఫుల్ జోష్‌లో కూటమి అభ్యర్థులు - ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తు ప్రచారం - NDA LEADERS ELECTION CAMPAIGN
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కూటమి అభ్యర్థి షాజహాన్ బాషా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. షాజహాన్ బాషా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్థానిక నాయకులు, మహిళలతో వీధులన్నీ పసుపు మయమయ్యాయి. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో ఎమ్మిగనూరు కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి ప్రచారం చేశారు. తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కూటమితో అన్ని వర్గాలకు భవిష్యత్తు ఉంటుందని చెప్పారు.
నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ కూటమి అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి ప్యాపిలి మండలంలో ప్రచారం చేశారు. అధిక సంఖ్యలో వచ్చిన గ్రామస్థులు రోడ్‌షోలో పాల్గొన్నారు. హుసేనాపురం, ఊటకొండ గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులు కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును మింగేశారని కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని కక్కిస్తామని కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిని గెలిపించాలంటూ సినీ నటుడు నారా రోహిత్, హాస్యనటుడు రఘు ప్రచారం నిర్వహించారు. ఐదేళ్ల జగన్ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని నారా రోహిత్ అన్నారు. సైకిల్ గుర్తుపై ఓటేసి నెల్లూరు పార్లమెంటు కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని, కావలి ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
కూటమి మేనిఫెస్టోతో జోరుగా ప్రచారం - వైఎస్సార్సీపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు - Election Campaign in AP
అమలాపురం పార్లమెంటు కూటమి అభ్యర్థి గంటి హరీష్, ఎమ్మెల్యే అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. కరపత్రాలు పంచుతూ తమను గెలిపించమని విజ్ఞప్తి చేశారు. అల్లూరి జిల్లా రంపచోడవరం కూటమి అభ్యర్థి మిరియాల శిరీష మన్యంలో లోతట్టు ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో చేయబోయే సంక్షేమ కార్యక్రమాలను గిరిజనులకు వివరించారు. కొండలు, గుట్టలు ఎక్కి గిరిజనులను చైతన్య పరిచారు. గిరిజనులతో కలిసి చింతపిక్కలు తీసి అందరినీ ఆకర్షించారు.
విజయనగరం జిల్లా బొబ్బిలిలో కూటమి అభ్యర్థి బేబీ నాయనకు మద్దతుగా ఆయన సోదరుడు సుజయకృష్ణ రంగారావు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలో కూటమి అభ్యర్థి ఈశ్వరరావు ప్రచారం చేశారు. గ్రామస్థులు భారీ ర్యాలీ నిర్వహించి ఆయనకు స్వాగతం పలికారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం కూటమి అభ్యర్థి గోవిందరావు, లోక్‌సభ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు నియోజకవర్గంలో ప్రచారం చేశారు. గ్రామాల్లో వారికి అభిమానులు, కార్యకర్తలు బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. సామాన్య ప్రజలు బతికి ఉండాలంటే కూటమి అధికారంలోకి రావాలని రామ్మోహన్‌నాయుడు అన్నారు. అనకాపల్లి నియోజకవర్గం నాతవరం మండలానికి చెందిన 150 మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. నర్సీపట్నం కూటమి అభ్యర్థి అయ్యన్నపాత్రడు వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ప్రచారాల్లో దూసుకెళ్తున్న కూటమి నేతలు - హారతులు, గజమాలలతో మహిళల స్వాగతం - Alliance Leaders Campaigning in AP