ETV Bharat / state

హైకోర్టుకు నూతన జడ్జిలు - ప్రమాణస్వీకారం చేయించిన సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ - HIGH COURT JUDGES SWEARING IN

ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం - జడ్జిలతో ప్రమాణం చేయించిన సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌

HIGH_COURT_JUDGES_SWEARING_IN
HIGH_COURT_JUDGES_SWEARING_IN (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2025, 7:01 PM IST

Updated : Jan 24, 2025, 7:43 PM IST

High Court New Additional Judges Swearing-in Ceremony in: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్‌ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్‌ డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ వారిచే ప్రమాణం చేయించారు. హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఇద్దరు అదనపు న్యాయమూర్తుల ప్రమాణంతో జడ్జిల సంఖ్య 30కి చేరింది.

Justice Hariharanath Sharma: జస్టిస్‌ హరిహరనాథ శర్మ స్వస్థలం కర్నూలు జిల్లా. ఉస్మానియా కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. నెల్లూరు వీఆర్‌ లా కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1994లో న్యాయవాదిగా బార్‌ కౌన్సిల్‌లో ఎన్‌రోల్‌ అయ్యారు. కర్నూలు జిల్లా కోర్టులో ప్రాక్టీసు ప్రారంభించిన ఆయన సీనియర్‌ న్యాయవాది రామకృష్ణారావు వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. 1998లో సొంతంగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 2007 అక్టోబరులో జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో సేవలు అందించారు. 2017-18 మధ్య అనంతపురం జిల్లా ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జిగా 2020 - 22లో విశాఖ పీడీజేగా పనిచేశారు. 2022లో హైకోర్టు రిజిస్ట్రార్‌గా 2023లో ఏపీ జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

Justice Dr Yadavalli Lakshmana Rao: జస్టిస్‌ డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావు స్వస్థలం ప్రకాశం జిల్లా. నెల్లూరు వీఆర్‌ లా కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. క్రిమినల్‌ లా, కంపెనీ లాలో బంగారు పతకాలు పొందారు. 2000వ సంవత్సరంలో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కావలిలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో పోస్టుగ్రాడ్యుయేషన్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. 2014లో జ్యుడీషియల్‌ సర్వీసులోకి వచ్చారు. మొదట ఏలూరు జిల్లా అదనపు జిల్లా జడ్జిగా పోస్టింగ్‌ తీసుకున్నారు. తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో సేవలు అందించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పీడీజేగా పనిచేస్తూ 2021 సెప్టెంబరు 2న హైకోర్టు రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. 2022 అక్టోబరు 22న రిజిస్ట్రార్‌ జనరల్‌గా నియమితులయ్యారు.

కోడి కత్తి కేసు మరోసారి వాయిదా - జగన్ రాకపోవడమే కారణమన్న లాయర్

విశాఖ నడిబొడ్డున ‘ఐటీ’కి ఐకానిక్‌ భవనం - 11 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలు

Last Updated : Jan 24, 2025, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.