ETV Bharat / state

ఆ పథకంతో కరెంట్ బిల్లు లేకుండా చేసుకున్నారు- ఆ అదృష్టం కూడా దక్కింది - COUPLE TO DELHI REPUBLIC DAY

దిల్లీ గణతంత్ర దినోత్సావాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి చెందిన పలువురికి ఆహ్వానం

anakapalle_couple_invited_to_republic_day_celebrations
anakapalle_couple_invited_to_republic_day_celebrations (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2025, 6:14 PM IST

Anakapalle Couple Invited to Republic Day Celebrations : రాష్ట్రంలో వివిధ అంశాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన పలువురికి దిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనే అవకాశం దక్కింది. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం ఉమ్మలాడ గృహిణికి దిల్లీలో ఈనెల 26న నిర్వహించనున్న గణతంత్ర వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానం అందింది. పాయకరావుపేటకు చెందిన భీమిశెట్టి నాగేశ్వరరావు, లావణ్య రమాకుమారి దంపతులు ఉమ్మలాడలో స్థిరపడ్డారు. విద్యుత్తు ఆదాకు కేంద్రప్రభుత్వం సూర్యఘర్‌ పథకాన్ని అమలు చేసింది. రాయితీపై ఇంటిపైనే సోలార్‌ పరికరాలు ఏర్పాటు చేస్తోంది. ఇంటి అవసరాలకు సరిపడా విద్యుత్తును వినియోగించుకుని మిగులు విద్యుత్తును ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ఈ పథకం అమలు చేస్తోంది.

ఈ పథకం కింద లావణ్య రమాకుమారి ఏడాది క్రితం 5కేవీ విద్యుత్తు ఉత్పత్తి అయ్యే సోలార్‌ పలకలు ఏర్పాటు చేశారు. అంతకుముందు ఇంటి అవసరాలకు వినియోగించే విద్యుత్తు బిల్లు నెలకు రూ.మూడు వేలు పైగా వచ్చేదని లావణ్యా రమాకుమారి తెలిపారు. సోలార్‌ విద్యుత్తు ఏర్పాటుచేసిననాటి నుంచి జీరో బిల్లు వస్తోందన్నారు.

ఇంటి పైకప్పుపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్‌ బిల్లును తగ్గించుకునేందుకు ‘ప్రధానమంత్రి సూర్య ఘర్‌ యోజన’ పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టిన సందతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కోటి మంది ప్రజలకు సౌర విద్యుత్‌ ఏర్పాటుకు రాయితీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఒక్కో ఇంటిపై గరిష్ఠంగా 3 కిలోవాట్లకు రూ.78 వేల చొప్పున రాయితీ ఇస్తోంది.

Kakinada Anganwadi EMployee To Delhi Republic day Celebrations : కాకినాడ జిల్లా పెద్దాపురంలో అంగన్వాడీ కార్యకర్తగా పని చేస్తున్న వీరంరెడ్డి నెహ్రూకుమారిని సక్షమ్‌ అంగన్వాడీగా ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం ఆమెకు గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించింది. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన గిరిజన మహిళ ప్రేమికను కూడా గణతంత్ర దినోత్సవాలకు ఆహ్వానించారు. చిత్తూరు జిల్లా ఎస్​ఆర్​. పురం మండలం పుల్లూరు గ్రామ సర్పంచ్‌ భవ్యశ్రీకి గణతంత్ర వేడుకలకు హాజరయ్యే అవకాశం కలిగింది. గ్రామంలో నీటి సరఫరా, చెత్త, మురుగు నిర్వహణలో అధునాతన విధానాలను అమలు చేస్తున్నందుకు గాను ఆమెకు గౌరవం దక్కింది. గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం రావడం పట్ల ఆ గౌరవం దక్కించుకున్న మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రం స్కీమ్​తో ఫ్రీ కరెంట్- కొత్త సోలార్ పథకానికి అప్లై చేసుకోండిలా! - PM Surya Ghar Muft Bijli Yojana

రాష్ట్రంలో కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు గ్రీన్ సిగ్నల్ : మంత్రి గొట్టిపాటి - Gottipati Took Charge as Minister

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.