TDP Flag On Vizag Rushikonda Palace :రుషికొండ పై తెలుగుదేశం జెండా! జగన్ రెండోసారి అధికారంలోకి వచ్చాక విశాఖ రాజధానిగా రిషికొండ నుంచే పాలన చేస్తారనే సంకేతాలు ఇచ్చిన వైఎస్సార్సీపీ నేతలు రిషికొండపై నుంచే తన పాలన ఉండాలని ఎంతో ముచ్చటపడ్డారు. ఆది నుంచి రిషికొండపై రహస్యంగా కార్యకలపాలను కొనసాగించిన జగన్ సర్కార్ చివరికి హై కోర్టును కూడా తప్పుదారి పట్టించారనే టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. రిషికొండపై నిర్మాణాల కోసం వందల కోట్లు ఖర్చు చేశారు. ఉన్నతాధికారులు సైతం ఈ నిర్మాణాల్లో అత్యుత్సాహం చూపారని, కోర్టును తప్పదోవ పట్టించారనే ఆరోపణలున్నాయి.
రుషికొండపై హడావుడిగా 'ప్యాలెస్' - వినియోగంపై స్పష్టతేదీ జగన్?
విశాఖ నగరంలో సముద్ర తీరానికి ఆనుకొని ఎంతో సుందరంగా కనిపించే ‘రుషికొండ’ ప్రస్తుత పరిస్థితి చూసి ప్రకృతి ప్రేమికులు అయ్యో! అంటున్నారు. చుట్టూ తవ్వేసిన తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా అయితే విహంగ వీక్షణంలో ఈ ప్రాంతం కనువిందు చేస్తుంది. విమాన ప్రయాణికులు పైనుంచి ఈ ప్రాంతాన్ని తిలకిస్తూ విశాఖ సొబగులకు ముగ్ధులవుతారు. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్టులో భాగంగా కొండ చుట్టూ తవ్వేసి పైభాగం వదిలారు. దీంతో రుషికొండ కళా విహీనంగా కనిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. విమాన ప్రయాణికుడొకరు తీసిన ఈ చిత్రం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.
రుషికొండ ప్యాలస్ పై పసుపు జెండా (ETV Bharat) విశాఖలో మరో కొండకు గుండు కొడుతున్న వైసీపీ నేతలు - భారీ యంత్రాలతో తవ్వకాలు
రహస్యంగా రుషికొండ రిసార్ట్ ప్రారంభం - ప్రభుత్వం నుంచి కొద్దిమందికే ఆహ్వానాలు