తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటమి భయం వైఎస్సార్సీపీని నరరూప రాక్షసుల్లా మార్చేసింది - దాడులపై మండిపడ్డ లోకేశ్​, టీడీపీ నేతలు - TDP Condemn YSRCP Leaders Attacks - TDP CONDEMN YSRCP LEADERS ATTACKS

TDP Condemns YSRCP Leaders Attacks in AP: పోలింగ్‌ ముగిసిన ఆంధ్రప్రదేశ్​లో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై వైఎస్సార్సీపీ శ్రేణులు వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడులను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. టీడీపీకి ఓటు వేశారనే అనుమానంతో గర్భిణిపై దాడి చేయడంపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తపై జరిగిన ప్రతి ఒక్క దాడికీ వడ్డీతో సహా చెల్లిస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

TDP Condemn YSRCP Leaders Attacks in AP
TDP Condemn YSRCP Leaders Attacks in AP

By ETV Bharat Telangana Team

Published : May 15, 2024, 2:30 PM IST

ఓటమి భయం వైఎస్సార్సీపీని నరరూప రాక్షసుల్లా మార్చేసింది - దాడులపై మండిపడ్డ లోకేశ్​, టీడీపీ నేతలు

TDP Condemns YSRCP Leaders Attacks in AP :ఏపీలోపోలింగ్‌ రోజు విధ్వంసం సృష్టించిన వైఎస్సార్సీపీ శ్రేణులు ఇప్పటికీ దాడుల పరంపరను కొనసాగిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలపై విరుచుకుపడుతున్నారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ దాడులను టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఖండించారు.

నారా లోకేశ్‌ : ఓటమి భయం వైఎస్సార్సీపీ నేతలను నరరూప రాక్షసులుగా మార్చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. టీడీపీకి ఓటు వేశారనే అనుమానంతో తిరుపతి జిల్లా పెళ్లకూరుమిట్టకు చెందిన గర్భిణిపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నచ్చినట్లు ఓటు వేసే స్వేచ్ఛ కూడా లేకుండా చేసిన వైఎస్సార్సీపీ పతనం ఖాయమని స్పష్టంచేశారు. గర్భిణికి మెరుగైన వైద్యం అందించి నిందితులను అరెస్టు చేయాలని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.

వైఎస్సార్సీపీ దమనకాండ - పులివర్తి నానిపై హత్యాయత్నం - కారంపూడి, తాడిపత్రిలోనూ విధ్వంసం - AP Elections 2024

అచ్చెన్నాయుడు :రాష్ట్రంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై వైఎస్సార్సీపీ శ్రేణుల వరుస దాడులను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. ఓటమి భయంతో వైఎస్సార్సీపీ శ్రేణులు నిరాశ, నిస్పృహలో కూరుకుపోయి దాడులకు తెగబడుతున్నాయని అన్నారు. వైసీపీ రౌడీమూకల అరాచకాలన్నింటికీ తప్పక సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. పల్నాడులో పిన్నెళ్లి సోదరుల అరాచకాల వల్ల 144 సెక్షన్‌ విధించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. భారీగా పోలీసుల్ని మోహరించి పిన్నెళ్లి రౌడీల నుంచి ప్రజల్ని కాపాడుకోవాల్సి వస్తోందన్నారు. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ అనుచరులపై వైసీపీ నేతలు రాడ్లతో దాడి చేశారని అన్నారు.

జేసీ దివాకర్​ రెడ్డి : అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి ఇంట్లోకి పోలీసులు చొరబడి టీడీపీ కార్యకర్తలు, నాయకులపై దాడి చేశారన్నారు. ఇంట్లో పని మనుషుల్ని కూడా ఎత్తుకెళ్లడం సిగ్గుచేటని అన్నారు. జగన్‌రెడ్డి గూండాల చేతుల్లో పోలీసులు కీలుబొమ్మలుగా మారారని మండిపడ్డారు. వందలాది మంది రౌడీలు రాడ్లు, కత్తులు పట్టుకుని వీరంగం సృష్టిస్తున్నారంటే రాష్ట్రంలో ఏం జరుగుతోందని నిలదీశారు. టీడీపీ కార్యకర్తపై జరిగిన ప్రతి ఒక్క దాడికీ వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.

రణరంగంగా తాడిపత్రి - రహస్య ప్రాంతానికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి - High Tension in Tadipatri

అమర్నాథ్‌రెడ్డి :తిరుపతిలోని స్విమ్స్‌లో పులివర్తి నానిని అమర్నాథ్‌రెడ్డి పరామర్శించారు. పులివర్తి నానిపై దాడిని తీవ్రంగా ఖండిచారు. చెవిరెడ్డి కుటుంబానికి ఓటమి భయం పట్టుకుందని అన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేతలను వదిలేసి టీడీపీ నేతలను ఎందుకు అరెస్టు చేస్తున్నారని, పులివర్తి నానిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

బీద రవిచంద్ర యాదవ్‌ : ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ పాలనలో అరాచకం కొనసాగిందని టీడీపీ నేత బీద రవిచంద్ర యాదవ్‌ విమర్శించారు. అధికార పార్టీ నాయకులకు అధికారులు, పోలీసులు తొత్తులయ్యారని ఆరోపించారు. సాధారణంగా ఎన్నికలకు 6 నెలల ముందు అధికారులు జాగ్రత్తగా ఉంటారని అన్నారు. కానీ రాష్ట్రంలో విచిత్ర పోకడ కనిపించిందని తెలిపారు. 3 నెలలుగా అధికార పార్టీ దౌర్జన్యాలు, దాడులతో ఓటర్లను భయపెట్టిందని తెలిపారు. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, పల్నాడు పలు జిల్లాల్లో పోలింగ్ రోజు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారని ఆరోపించారు. అమానుషంగా దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీను సాగనంపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రజలు ఓటు వేశారని ఆయన చెప్పారు.

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి - పద్మావతి యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత - Attack on Pulivarthi Nani in Tpty

ABOUT THE AUTHOR

...view details