Tata Technologies signed MoU with Telangana Government :రాష్ట్రంలోని ఐటీఐ(ITI) కాలేజీలను అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా మార్చేందుకు టాటా టెక్నాలజీస్(TATA Technologies)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర అధికారులు, టాటా టెక్నాలజీస్ ప్రతినిధుల మధ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉపాధి శిక్షణా విభాగం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాణికుముదిని, టాటా టెక్నాలజీస్ గ్లోజల్ హ్యూమన్ రీసోర్సెస్ ప్రెసిడెంట్ పవన్ భగేరియా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐను సుమారు రూ.2,700 కోట్ల రూపాయలతో స్కిల్లింగ్ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ఎంవోయూ(MoU)జరిగింది. సచివాలయంలో టాటా టెక్నాలజీస్‌తో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమావేశమయ్యారు. వర్కుషాప్ నిర్మాణం, యంత్ర పరికరాలు, సామగ్రితో పాటు శిక్షణను అందించే ట్యూటర్ల నియామకాన్ని టాటా టెక్నాలజీస్ చేపడుతుంది. ప్రాజెక్టులో భాగంగా ఐటీఐలలో కొత్తగా 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులు ప్రవేశపెడతారు. ఏటా 9వేల మందికి అడ్మిషన్లు కల్పిస్తారు. సుమారు లక్ష మందికి షార్ట్ టర్మ్ కోర్సుల ద్వారా శిక్షణను అందిస్తారు. రానున్న 2024 - 25 విద్యా సంవత్సరం నుంచే ఈ ప్రాజెక్టు అమలుకు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ నుంచి మొదలయ్యే అకడమిక్ సెషన్‌కు వర్కుషాపులను అందుబాటులో ఉంచాలని తగినంత ట్యూటర్లను నియమించాలని టాటా టెక్నాలజీ ప్రతినిధులకు సీఎం సూచించారు.
గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో అభివృద్ధే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్-2050