ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీమంత్రి మేరుగు నాగార్జునపై రేప్ కేసు

మేరుగు నాగార్జున కాంట్రాక్టు పనులు ఇప్పిస్తానని రూ. 90 లక్షలు తీసుకున్నారు - డబ్బు తిరిగి ఇవ్వకుండా లైంగికంగా వేధించారు

Rape Case in Merugu Nagarjuna
Rape Case in Merugu Nagarjuna (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 2, 2024, 8:06 AM IST

Rape Case in Merugu Nagarjuna : కాంట్రాక్టు పనులు లేదా ఉద్యోగం ఇప్పిస్తానని తన వద్ద డబ్బు తీసుకుని తిరిగివ్వకపోవడంతోపాటు శారీరకంగా వాడుకున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత మేరుగు నాగార్జునపై విజయవాడకు చెందిన ఓ మహిళ ఆరోపణలు చేసింది. ఈ మేరకు బాధితురాలు శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు మేరుగు నాగార్జునపై అత్యాచారం, మోసం కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రికి సహకరించి, బాధితురాలిని బెదిరించిన ఆయన పీఏపై బెదిరింపుల కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

పోలీస్​ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చిన అనంతరం బాధితురాలు మీడియాతో మాట్లాడారు. ‘ఐదు సంవత్సరాలుగా నాకు మాజీ మంత్రి మేరుగు నాగార్జునతో పరిచయం ఉంది. ఆయన తన శాఖకు సంబంధించిన కాంట్రాక్టు పనులు లేదా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర రూ.90 లక్షలు తీసుకున్నారు. సార్‌ మీతో మాట్లాడతానన్నారు అని చెప్పి ఆయన పీఏ మురళీమోహన్‌రెడ్డి తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని మంత్రి ఉండే అపార్టుమెంట్‌కు తీసుకెళ్లేవాడు.

Merugu Nagarjuna Harassment Case : గదిలోకి వెళ్లిన వెంటనే బయట తాళాలు వేసి వెళ్లిపోయేవాడు. ఎలాంటి కాంట్రాక్ట్‌ పనులు ఇప్పించకపోగా ఈ నేపథ్యంలో మేరుగు నాగార్జున నన్ను బలవంతంగా నాలుగుసార్లు శారీరకంగా అనుభవించారు. నేనిచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రాధేయడినా పట్టించుకోలేదు. గట్టిగా అడిగితే విశాఖకు చెందిన ఓ గిరిజన టీచర్‌ను స్లోపాయిజన్‌ ఇచ్చి హతమార్చామన్నారు. నీకు కూడా ఆ గతే పడుతుందని ఆయన పీఏ బెదిరించారు. అప్పులు, బ్యాంకులకు చెల్లించాల్సిన ఈఎంఐల ఒత్తిడి తట్టుకోలేక ఇప్పుడు పోలీసులను ఆశ్రయించాను’ అని బాధితురాలు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రి లోకేశ్‌ తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి, ఆయన పీఏపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కల్యాణ్‌రాజు పేర్కొన్నారు.

ఏ తప్పూ చేయలేదు : తనపై ఆరోపణలు చేసిన మహిళతో ఎటువంటి సంబంధం లేదని మాజీ మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. తన ప్రమేయం ఉన్నట్లు తేలితే ఎటువంటి పరీక్షలకైనా, ఉరిశిక్షకైనా సిద్ధమేనని అన్నారు. మహిళ వద్ద రూ.90 లక్షలు తీసుకున్నానని, ఆమెను లోబరుచుకునేందుకు ప్రయత్నించాననడం అవాస్తవమని చెప్పారు. తనపై ఆరోపణలు, ఫిర్యాదులు అంతా కుట్ర ప్రకారం జరిగాయని వివరించారు. ఈ ఫిర్యాదుపై తానే జిల్లా ఎస్పీని కలిసి పూర్తిస్థాయి విచారణ కోరతానని తెలిపారు. అవసరమైతే ప్రైవేట్ కేసులు కూడా వేస్తానని, కుట్రదారుల్నీ వదిలిపెట్టనని మేరుగు నాగార్జున వ్యాఖ్యానించారు.

"జగన్‌ జోలికొస్తే బండికి కట్టి లాక్కుపోతా" - పరారీలో కొందరు, జైళ్ల భయంతో ఎందరో!

మాజీ మంత్రి ఆళ్ల నానిపై చీటింగ్ కేసు నమోదు - case Filed on Alla Nani

ABOUT THE AUTHOR

...view details