Brutal Murder in Mahanandi : నంద్యాల జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. మహానంది మండలం సీతారామాపురం గ్రామంలో శనివారం నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత పసుపులేటి సుబ్బరాయుడు (68) అలియాస్ పెద్దన్నను బుడ్డారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆయన అనుచరులు దారుణంగా హత్య చేశారు. 38 మంది వారిపై ఇంటిపై దాడిచేసి, పెద్దన్నను కర్రలు, ఇనుప రాడ్లతో కొట్టారు. అనంతరం బండరాయితో తలపై మోది అతని భార్య కళ్ల ముందే కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
Two Cops Suspend in Nandyal Murder Case : అయితే మరోవైపు ఘటనకు ముందు పరిస్థితిపై సకాలంలో ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయడంలో సీఐ, ఎస్సై విఫలమయ్యారంటూ అధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా నంద్యాల రూరల్ సీఐ శివకుమార్‌రెడ్డి, మహనంది ఎస్సై నాగేంద్రప్రసాద్‌పై సస్పెన్షన్ వేటు పడింది.
A Person Killed in Sitaramapuram :పసుపులేటి సుబ్బరాయుడి హత్యకు ఆర్థిక విభేదాలే కారణమని సమాచారం. బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి, పసుపులేటి సుబ్బరాయుడు ఇద్దరూ వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడే ఆర్థికపరమైన విషయాల్లో ఘర్షణలు పడేవారు. సుబ్బరాయుడుకు చెందిన 15 సెంట్ల స్థలాన్ని శ్రీనివాసరెడ్డి తీసుకోవడం, మరోచోట స్థలం ఇస్తానని చెప్పిన మాట మూడు సంవత్సరాలుగా అమలు చేయకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. దీనికి తోడూ శ్రీనివాసరెడ్డి వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి మారినా సుబ్బరాయుడు వైఎస్సార్సీపీలోనే ఉండిపోయారు.