Suspected Container Vehicle at AP CM Camp Office :ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిలో (Tadepalli Jagan Camp Office)ఉన్న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఒక కంటెయినర్ వాహనం వచ్చి వెళ్లిన తీరు చర్చనీయాంశమైంది. మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఏపీ 16 జడ్ 0363 (AP16 Z 0363) నంబరుతో వచ్చిన ఈ వాహనంపై పోలీస్ స్టిక్కర్ ఉంది. సాధారణంగా జడ్ (Z) సిరీస్ ఆర్టీసీ బస్సులకు, పీ (P) సిరీస్ పోలీసు వాహనాలకు ఉంటుంది.
Suspected Vehicle in Jagan Camp Office : సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చే దారిలో ప్రధాన రహదారి వద్ద మెయిన్ గేట్ ఉంటుంది. అక్కడ వాహనం, అందులో ఉన్నవారి వివరాలను నమోదు చేసుకుని లోపలికి అనుమతిస్తారు. అదే సమయంలో ఆ వాహనం వివరాలను వైర్లెస్ ద్వారా ముందున్న చెక్‌పోస్టు సిబ్బందికి చెబుతారు. మెయిన్ గేటు నుంచి నుంచి డివైడర్‌కు ఎడమ వైపున ఈ వాహనాలు లోనికి వస్తాయి. మధ్యలో రెండో చెక్‌పోస్టు వద్ద ఆటోమేటిక్ స్కానర్ ఉంటుంది. ఇక్కడ కూడా భద్రతా సిబ్బంది వాహనం నంబరు, అందులో వచ్చిన వారి వివరాలను సరి చూసుకుంటారు.
రాంగ్‌రూట్లో వాహనం : ముందుగా అనుమతి ఉన్న సమాచారం ఉన్న వాహనాలనైతే ఆ స్కానర్ మీదుగా లోపలికి పంపుతారు. మంగళవారం వచ్చిన కంటెయినర్ ప్రధాన గేటు వద్ద ఎడమ వైపు రహదారిలో వచ్చినా, రెండో చెక్‌పోస్టుకు కాస్త ముందుగానే ఎడమ వైపు కాకుండా కుడి వైపు దారిలో మళ్లించి రాంగ్‌రూట్లోనే క్యాంపు కార్యాలయానికి తీసుకువెళ్లారు. అందువల్ల రెండో చెకోపోస్టు వద్ద వాహనాన్ని స్కాన్ చేయలేదు.