తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో భానుడి భగభగలు- నాలుగు జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు - temperatures in Telangana

Temperature Details in Telangana : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇవాళ 28 జిల్లాల్లో 42 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా సూర్యాపేట జిల్లా శాంతినగర్​లో 44.5 డిగ్రీలు నమోదుకాగా, మిగతా ప్రాంతాలతో పోలిస్తే తక్కువగా ఆదిలాబాద్ జిల్లా సాత్నాలలో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.

IMD Issues Alert on Heat waves
Temperature Details in Telangana

By ETV Bharat Telangana Team

Published : Apr 7, 2024, 7:32 PM IST

Updated : Apr 7, 2024, 7:47 PM IST

Temperature Details in Telangana :రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అడుగు బయటపెట్టాలంటే జనం జంకుతున్నారు. తీవ్రంగా వీస్తున్న వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.ఇవాళ 28 జిల్లాల్లో 42 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా సూర్యాపేట(Suryapet) జిల్లా శాంతినగర్​లో 44.5 డిగ్రీలు నమోదు కాగా, మిగతా ప్రాంతాలతో పోలిస్తే, తక్కువగా ఆదిలాబాద్(Adilabad) జిల్లా సాత్నాలలో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. నాలుగు జిల్లాలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సూర్యాపేట 44.5, నల్గొండ 44.5, ఖమ్మం 44.4, గద్వాల 44.1 సెల్సియస్ డిగ్రీల గరిష్ఠ రికార్డులకు చేరుకున్నాయి.

రాష్ట్రంలో భానుడి భగభగలు- నాలుగు జిల్లాలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

ఎండాకాలంలో రోజుకు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే? - how much water to drink in Summer

IMD Issues Alert on Heat waves :ఏప్రిల్‌ ప్రథమార్థంలోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే, ఈ మాసం చివరితో పాటు మే నెలలో పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని ప్రజలు జంకుతున్నారు. మే నెలలో ఉష్ణోగ్రతలు 48 నుంచి 49 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎండలకు తోడు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో తీవ్రమైన వడగాల్పులు వీచాయి. వృద్ధులు, చిన్న పిల్లలపై ఉష్ణోగ్రతలు, వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంది.

ఆ సమయంలో బయటకు రావద్దు :ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు బయటకు రావొద్దని వాతావరణ శాఖ (Indian Metrological Department) హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో రావాల్సి వస్తే, తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 2015, 16 సంవత్సరాల్లో కూడా ఎండలు దంచికొట్టాయి. ఆ రెండు సంవత్సరాల్లో ఎండల తీవ్రతకు అనేక మంది మృత్యువాతపడ్డారు. అలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం (Government) సైతం ప్రజలను హెచ్చరిస్తోంది.

Summer Precautions for Sunburn : ఎండల నుంచి బయటపడటానికి దాహం వేయకపోయినా వీలైనప్పుడల్లా తగినంత నీరు తాగాలని ఆరోగ్య శాఖ పేర్కొంది. బయటకు వెళ్లేప్పుడు తాగునీటిని వెంట తీసుకెళ్లాలని, ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌ -(ORS)ను వినియోగించాలని సూచించింది. నిమ్మరసం, మజ్జిగ, లస్సీ వంటి ఇంట్లో తయారుచేసిన పానీయాలు తీసుకోవాలని తెలిపింది.

కళ్ళు తిరగడం, వికారంగా, తలనొప్పిగా ఉండడం, విపరీతమైన దాహం వేయడం, మూత్ర విసర్జన తగ్గడం, మూత్రం రంగు మారడం, గుండె దడ వంటి లక్షణాలు వడదెబ్బ(Sunburn) యొక్క సాధారణమైన లక్షణాలుగా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే అత్యవసర పరిస్థితిలో 108కి కానీ 102కు కానీ కాల్ చేసి సదరు వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని పేర్కొంది. ఎండలు మండుతాయని ఈ నేపథ్యంలోప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకొని ఎండ తాకిడి నుంటి తమకుతాము రక్షించుకుంటే మేలని నిపుణులు చెబుతున్నారు.

సమ్మర్​ ఎఫెక్ట్- కుక్కలకు షూ, కూలర్లు ఏర్పాటు- ఎక్కడో తెలుసా? - Police Dogs Wear Shoes In Karnataka

ఎండాకాలంలో స్ట్రోక్ ప్రమాదం! ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే! - Heart Stroke In Summer

Last Updated : Apr 7, 2024, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details