Supreme Court on SC Classification : ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తూ సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం నిర్ణయించింది. పంజాబ్ ప్రభుత్వం ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ(SC Classification)పై భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పంజాబ్ గవర్నమెంట్ వేసిన పిటిషన్‌ను ప్రధాన పిటిషన్‌గా స్వీకరిస్తూ సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది.
వర్గీకరణకు అనుకూలంగా, వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లను కూడా విచారించింది. అయితే వర్గీకరణపై దాఖలైన అన్ని పిటిషన్లను పంజాబ్ పిటిషన్‌కు న్యాయస్థానం జత చేసి విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లలో ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ గతంలో సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణకు రాష్ట్ర మంత్రి దామోదర్ రాజ నరసింహ హాజరయ్యారు.
వర్గీకరణకు శాసనసభలు సిద్ధంగా ఉన్నాయా : విచారణలో భాగంగా అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని ప్రశ్నలను సంధించింది. అసమానతలను తొలగింపునకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ధర్మాసనం ప్రశ్నించింది. వర్గీకరణకు రాష్ట్ర శాసనసభలు సిద్ధంగా ఉన్నాయా అంటూ వివరణ కోరింది. ఈ కేసు విచారణలో భాగంగా అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను రాజ్యాంగ ధర్మాసనం తెలుసుకోనుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వర్గీకరణను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిందని గుర్తు చేశారు.
Manda Krishna Madiga: 'ఎస్సీ వర్గీకరణపై రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధిలేదు'