మధ్యవర్తిత్వ విధానం ద్వారా సమస్యలు త్వరగా పరిష్కారం: సుప్రీంకోర్టు న్యాయమూర్తి Supreme Court Judge High Court Justice Laid Foundation For Court Complex: వివాదాల పరిష్కారం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించిన వారు సంవత్సరాల తరబడి న్యాయం కోసం వేచిచూడాల్సిన అవసరం లేకుండా మధ్యవర్తిత్వం ద్వారా వాటిని పరిష్కరించేందుకు న్యాయవాదులు ప్రయత్నించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ అన్నారు. మారుతున్న పరిస్థితుల్లో మన దేశం ప్రపంచ లీడర్‌గా రూపొందుతోందని, దీనిని దృష్టిలో ఉంచుకొని న్యాయ వ్యవస్థలోనూ మార్పులు రావలసి ఉందని ఆకాంక్షించారు.
పక్షపాతం లేకుండా తీర్పు ఇవ్వాలి: జస్టిస్ బట్టు దేవానంద్
Supreme Court Justice Sri Narasimha:విజయనగరంలో పాత జిల్లా కోర్టు ఆవరణలో నిర్మించనున్న జిల్లా కోర్టు కాంప్లెక్స్ నూతన భవన సముదాయానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనరసింహ, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో కలసి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కోర్టు నూతన భవనాల నిర్మాణానికి రూ. 99.2 కోట్లను మంజూరు చేసింది. 6.58 ఎకరాల విస్తీర్ణంలో సెల్లార్ కాకుండా ఆరు అంతస్థుల్లో ఆధునిక వసతులతో రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో హైకోర్టు భవనాలను నిర్మించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనరసింహ మాట్లాడుతూ కొత్తగా న్యాయవాద వృత్తిలోకి ప్రవేశిస్తున్న యువతి, యువకులు జిల్లా కోర్టుల్లో తమ వృత్తిని ప్రారంభించేలా సీనియర్ న్యాయవాదులు ప్రోత్సహించాల్సి ఉందన్నారు.
77th Independence Day Celebrations in AP High Court: "సమరయోధుల పోరాట ఫలితం వల్లే.. నేడు మనం స్పేచ్ఛగా జీవిస్తున్నాం"
విజయనగరంలో నూతన కోర్టు భవనాల ద్వారా మంచి వసతులు సమకూరనున్నాయని, వీటిని వినియోగించుకొని న్యాయవాదులు తమ వృత్తిలో సంతోషాన్ని పొందుతూ సమాజానికి సేవలు అందించాలన్నారు. ఈ ప్రాంతాన్ని గతంలో పరిపాలించిన వారు వేసిన విద్యా పునాదుల కారణంగా ఇక్కడి నుంచి ఎందరో కవులు, రచయితలు, విద్యావేత్తలు ఉద్భవించారని శ్రీనరసింహ పేర్కొన్నారు. న్యాయం కోసం సుదీర్ఘకాలం పాటు వేచిచూడాల్సిన పరిస్థితుల్లో మార్పు రావాలన్నారు. మధ్యవర్తిత్వంపై దృష్టిపెట్టి వివాదాల పరిష్కారంలో మెళకువలను న్యాయవాదులు తెలుసుకోవాలన్నారు. అన్నదమ్ముల మధ్య ఏర్పడిన ఆస్తి వివాదం పరిష్కారం కావాలన్నా, భార్యాభర్తల మధ్య స్పర్ధలు ఏర్పడితే వారు విడిపోవాలనుకున్నా అటువంటి సమస్యల పరిష్కారం కూడా 20 ఏళ్లు అవసరమా అనేది ఆలోచించాల్సి వుందన్నారు.
High Court Justice Dheeraj Singh Thakur:రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రజలు న్యాయవ్యవస్థపై ఎన్నో ఆశలు కలిగి వున్నారని, వారి ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేలా న్యాయమూర్తులు నిష్పక్షపాతంగా, స్వచ్ఛంగా, పారదర్శకంగా న్యాయవ్యవస్థను నిలపాలని అన్నారు. న్యాయస్థానంకు శంకుస్థాపన అంటే సాదాసీదా భవనానికి శంకుస్థాపన కాదని న్యాయానికి ఒక కోవెల వంటిదని ధీరజ్ సింగ్ పేర్కొన్నారు. ఇక్కడ చేపడుతున్న కోర్టు భవనాల నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపడతామని చెప్పారు. రాష్ట్రంలోని కోర్టుల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం రూ.186 కోట్లు కేటాయించి ఇందులో తొలివిడతగా 45 కోట్లు విడుదల చేసిందన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటుగా 30కోట్లు అందచేసిందన్నారు. 75కోట్లలో 50కోట్ల మేరకు పాత పనులకు బిల్లులు చెల్లించామన్నారు. మిగిలిన 20 కోట్లను మార్చి నెలాఖరులోగా ఖర్చు చేయాల్సి ఉందని ధీరజ్ సింగ్ పేర్కొన్నారు.
AP High Court CJ : ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం