రామోజీ ఫిల్మ్‌సిటీలో సమ్మర్ కార్నివాల్ సంబరాలు - ఆనందడోలికల్లో తేలియాడుతున్న పర్యాటకులు Summer Holiday Carnival at Ramoji Film City 2024 :ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ వేసవి వినోదం సందర్శకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. అద్భుతమైన కళాఖండాలు, అబ్బుర పరిచే కట్టడాలు, పచ్చని ఉద్యానవనాలకు నిలయమైన ఫిల్మ్‌సిటీలో వేసవి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. చిత్రపురిని సందర్శిస్తున్న పర్యాటకులు సరికొత్త ప్రపంచంలో విహరించిన అనుభూతి పొందుతున్నారు. సమ్మర్ కార్నివాల్-2024లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. వేడుకల్లో భాగంగా ఉదయం 9:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు రోజంతా సరికొత్త వినోదం ప్రతేక కార్యక్రమాలు జరగుతున్నాయి.
Ramoji Film City Summer Special HolidayCarnival 2024 :సమ్మర్ కార్నివాల్‌లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున సందర్శకులు తరలివస్తున్నారు. ఫిల్మ్‌సిటీలో పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గేమ్ జోన్‌లో చిన్నారులు ఆటలాడుతూ సందడి చేస్తున్నారు. మ్యాజికల్ గార్డెన్‌లో బ్రేక్ డ్యాన్స్‌లో పాల్గొని సందర్శకులు ఆనందంగా గడిపారు. కార్నివాల్సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
రామోజీ ఫిల్మ్‌సిటీలో సమ్మర్ స్పెషల్ హాలిడే కార్నివాల్ - ఇక సందడే సందడి - Ramoji Film City Holiday Carnival
"ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవారు చూడాల్సినవి అన్ని ఉన్నాయి. చిన్న పిల్లలు రైడ్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ప్రదేశాల్లో తిరిగాం. కానీ ఇది మాత్రం ఒక సరికొత్తగా అనిపించింది. రైడ్స్, సెట్స్ అన్ని చూడటానికి బాగున్నాయి. హోటల్స్ లభించే ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. అందరూ సందర్శించాల్సి ప్రదేశం రామోజీ ఫిల్మ్‌సిటీ." - పర్యాటకులు
వివిధ భాషల్లో గీతాలకు కళాకారులు చేసిన నృత్యాలు సందర్శకులను మంత్రముగ్దుల్ని చేశాయి. వేసవి వినోదంలో భాగంగా కార్యక్రమానికి చివరగా ఏర్పాటు చేసిన కార్నివాల్ పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్నివాల్ పరేడ్‌లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన శకటాలు, శకటాల విద్యుత్ కాంతుల్లో కళాకారుల నృత్యాలు అదరహో అనిపించాయి. సినీ ప్రేక్షకుల మదినిదోచే ఆధునిక సాంకేతికత, మోషన్ క్యాప్చర్, వర్చువల్ షూట్‌ను పర్యాటకులు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఫిల్మ్‌సిటీలోని వర్చువల్ ప్రొడక్షన్ సెట్‌లోకి అడుగుపెట్టి ఆ క్షణాలను ప్రతి ఒక్కరూ మధుర జ్ఞాపకాలుగా మలుచుకుంటున్నారు. అంతేకాదండోయ్ రెయిన్ డ్యాన్స్ ఫ్లోర్‌పై వేసవితాపం దరిచేరకుండా జల్లుల్లో తడిసిముద్దవుతూ వారు ఆనందతీరాలను చేరుతున్నారు.
చెన్నై ట్రావెల్ ఫెయిర్‌లో రామోజీ ఫిల్మ్ సిటీ స్టాల్ సందడి- విజిటర్స్ ఫిదా!
110 Years of Indian Cinema Festival : రామోజీ ఫిల్మ్‌సిటీలో 110 ఏళ్ల ఇండియన్ సినిమా పండుగ.. మస్త్ ఎంటర్టైన్మెంట్