Students Spot Leopard At Tirupati SV University Auditorium : తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఆడిటోరియం ముందు చిరుతపులి వెళ్తుండగా విద్యార్థులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన వర్శిటీ అధికారులు అటవీశాఖ సిబ్బందికి తెలియజేయడంతో యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. చిరుత సంచరించిన ప్రాంతంలో పరిశీలించడంతో చిరుతపులి పాదముద్రలు ఉన్నట్లు గుర్తించారు.
అనంతరం చిరుత సంచారాన్ని పసిగట్టేందుకు పరిసర ప్రాంతాలలో కెమెరా ట్రాపర్స్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి ఎనిమిది తర్వాత బయటికి రావద్దని, ఉదయం ఆరున్నర తర్వాతనే బయట తిరగాలని ఎస్వీయూ అధికారులు విద్యార్థులకు ఆదేశాలు జారీ చేశారు.
"ఏ వైపు నుంచి వచ్చి దాడి చేస్తుందో" - చిరుతపులి కలకలం
తిరుమలలో మళ్లీ చిరుత - భయంతో తాళాలు వేసుకున్న సిబ్బంది - వీడియో వైరల్ - Leopard Found in Tirupati