Students Ragging in Boys Hostel at Narasaraopet:జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసి దారుణంగా హింసించి పైశాచిక ఆనందం పొందిన ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. ర్యాగింగ్‌కు సంబంధించిన వీడియో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కళాశాల బాయ్స్ హాస్టల్లో జూనియర్ విద్యార్థులను సీనియర్లు విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. సీనియర్ విద్యార్థులు జూనియర్లను ఊతకర్రతో చితకబాది పైశాచిక ఆనందం పొందారు. ఘటనకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 2న జరిగిన ఘటన : వీడియో వైరల్‌గా మారడంతో నరసరావుపేట ఒకటో పట్టణ సీఐ, పోలీసు సిబ్బంది కళాశాల హాస్టల్‌కు చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు. వీడియోలో సీనియర్ విద్యార్ధుల చేతుల్లో దెబ్బలు తిన్న జూనియర్ విద్యార్థులను పిలిచి సీఐ చింతల కృష్ణారెడ్డి విచారించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన ఈ ఘటన జరిగినట్లు విచారణలో తేలిందని ఒకటో పట్టణ సీఐ చింతల కృష్ణారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఘటనకు పాల్పడ్డ సీనియర్ విద్యార్ధులు పాస్ అయ్యి హాస్టల్ నుంచి వెళ్లిపోయినట్లు సీఐ కృష్ణారెడ్డి తెలిపారు.