Suicides in IITs is Increasing In Telangana :ట్రిపుల్‌ఐటీలో సీటు సాధించడం ఒక ఎత్తైతే అందులో చేరి భవిష్యత్తును నిర్మించుకోవటానికి కన్న కలలు మరో ఎత్తు. ఎన్నో ఆశలతో పాఠశాల స్థాయి నుంచి ఇక్కడి వరకు వచ్చిన విద్యార్థులు స్వల్ప కారణాలు, సమస్యలతో తనువు చాలిస్తున్నారు. పిల్లల అందమైన భవిష్యత్తు ఊహించిన తల్లిదండ్రులకు వేదన మిగులుతోంది. ఇందుకు కారణం బలవన్మరణాల నివారణ చర్యలు లేకపోవడం, భద్రతా వైఫల్యమే అని తెలుస్తోంది. ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం పల్లె నుంచి పట్నం బాట పడుతున్న విద్యార్థుల్లో ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పటివరకు తల్లిదండ్రులతో అల్లారుముద్దుగా ఉంటూ విద్యాభ్యాసం సాగించిన వారు ఒక్కసారిగా వాళ్లను వదిలి చదువుల ఒత్తిడికిలోనై తనువు చాలిస్తున్నారు.
ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు
- విద్యార్థుల వసతి గృహాలను మూడు పూటల తనిఖీ చేయాలి. బాలికల వసతి గృహాల్లో పర్యవేక్షకుల సంఖ్య పెంచి నిరంతరం నిఘా పెట్టాలి.
- హాస్టల్ గదుల్లో విద్యార్థినులను ఒంటరిగా ఉండనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- ప్రధానంగా తీసుకోవాల్సిన చర్య ఏంటంటే సీలింగ్ ఫ్యాన్లను తొలగించి వాటికి బదులుగా పెడస్టర్, గోడ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలి.
- కౌన్సెలింగ్ ఇచ్చేవారి సంఖ్య పెంచాలి.
- విద్యార్థులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారిని తరచూ పలకరించాలి, వారి ఇబ్బందులను అడిగి తెలుసుకోవాలి. కాస్త కలివిడిగా మాట్లాడి మనోధైర్యాన్ని నింపాలి.
- విద్యార్థి తల్లిదండ్రులతో అధ్యాపకులు సత్సంబంధాలు కలిగి ఉండాలి. పిల్లల వ్యక్తిగత సమస్యలను తల్లిదండ్రులను దృష్టికి తీసుకెళ్లే వ్యవస్థ ఉంటే మేలు.
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి - క్యాంపస్లో ఆందోళనలు