Student Delivery in Hostel Bathroom: ఓ విద్యార్థిని హాస్టల్ బాత్రూమ్లో ప్రసవించిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని బాత్రూంలో ప్రసవించింది. ఈ విషయం తెలుసుకున్న విద్యాలయ అధికారులు విద్యార్థిని పరిస్థితి చూడగా ఆమె అనారోగ్యంగా ఉండటంతో అక్కడి నుంచి వెంటనే చికిత్స కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అప్పటికే ఆ బిడ్డ మరణించినట్లు కస్తూర్బా సిబ్బంది గుర్తించారు.
హాస్టల్ బాత్రూమ్లో ప్రసవించిన విద్యార్థిని - దర్యాప్తు చేస్తున్న పోలీసులు - Student DELIVERY HOSTEL Bathroom
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 31, 2024, 8:12 PM IST
|Updated : Jul 31, 2024, 11:00 PM IST
Student Delivery in Hostel Bathroom: ప్రకాశం జిల్లాలో ఓ విద్యార్థిని వసతిగృహం బాత్రూమ్లో ప్రసవించటం స్థానికంగా కలకలం రేపింది. అధికారులు శిశువును చూడగా మృతి చెందినట్లు గుర్తించారు. ప్రకాశం జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనలో ఆ విద్యార్థిని తీవ్ర ఆనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Student Delivery in Hostel Bathroom (ETV Bharat)
విద్యార్థి రెండు నెలల నుంచి మోటుమాల వద్ద ఉన్న కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుందని విద్యాలయ అధికారులు తెలిపారు. విద్యాలయంలో చేరినప్పటికే బాలిక గర్భం దాల్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Last Updated : Jul 31, 2024, 11:00 PM IST