తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏఐతో మానవ జీవితమే మారిపోనుందా? - ఈ ఆవిష్కరణలు చూస్తే షాక్​ అవుతారు! - Story On Global AI Summit AT HICC - STORY ON GLOBAL AI SUMMIT AT HICC

Story On Global AI Summit AT HICC : పర్యావరణ కాలుష్యం అరికట్టడం, డ్రైవర్ ప్రమేయం లేకుండా కారు ముందుకెళ్లడానికి, విద్యుత్ బిల్లు తగ్గించుకునేందుకు, ఉద్యోగుల హాజరు శాతం, పని తీరు అంచనాకు కృత్రిమ మేధ ( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఒక్కటే మార్గం. అన్ని రోగాలకు ఒకే మందు మాదిరిగా ప్రతి రంగంలోనూ ఉత్తమ ఫలితాలకు కృత్రిమ మేధ వినియోగం తప్పనిసరైంది. ఏఐలో ఎన్నో ఆవిష్కరణల ప్రదర్శనకు హైదరాబాద్‌ వేదికగా మారింది. హైటెక్స్‌లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న అంతర్జాతీయ కృత్రిమమేథ సదస్సులో అంకుర పరిశ్రమలు ఆవిష్కరణలు కొలువుదీరాయి.

Innovations AT Global AI Summit
Innovations AT Global AI Summit (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2024, 7:17 AM IST

Innovations AT Global AI Summit : ప్రస్తుతం ఎవరి నోటవిన్నా ఏఐ గురించి చర్చ సాగుతోంది. ఇంట్లో వినియోగించే ఫ్రిజ్, గీజర్, వాషింగ్ మెషీన్, ఇస్త్రీ పెట్టే వంటి వాటి వినియోగంతో కరెంట్‌ వినియోగం పెరుగుతోంది. తద్వారా నెల తిరిగే సరిగి బిల్లు మోతమోగుతోంది. బిల్లు సంగతి పక్కనపెడితే కరెంట్‌ ఉత్పత్తితో భారీ స్థాయిలో కర్బన ఉద్గారాలు వెలువడుతాయి. కరెంట్‌ను పొదుపుగా వినియోగిస్తే డబ్బులు ఆదా అవ్వడం సహా పర్యావరణాన్ని రక్షించిన వాళ్లం అవుతాము. అదే ఆలోచనతో భారత్ స్మార్ట్ సర్వీసెస్‌ ఆధ్వర్యంలో పరికరాలు రూపొందించారు.

కరెంట్​ను పొదుపు చేయడంలో ఏఐ :కృత్రిమమేధతో రూపొందిన ఆ పరికరాలు కరెంట్‌ వినియోగాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతున్నాయి. ఆ మేరకు హెచ్ఐసీసీలో జరుగుతున్న సదస్సులో భారత్ స్మార్ట్‌ సర్వీసెస్‌ సీఇఓ సికిందర్‌డ్డి ప్రదర్శించారు. ప్రతికంపెనీలో ఉద్యోగుల పనితీరుఆధారంగానే ఫలితాలు ఉంటాయి. మార్కెటింగ్ చేసే ఉద్యోగులు ఏ వేళ ఎక్కడఉన్నారు.

కార్యాలయాలకు వచ్చే ఉద్యోగుల హాజరు శాతాన్ని తెలుసుకోవడంసహా నకిలీ హాజరుశాతం నిరోధించేందుకు ఏఐ సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి వచ్చింది. ఉద్యోగుల హాజరుని వేలిముద్రలు, ఫేస్ రికగ్నైజేషన్‌ విధానంలో హెచ్‌ఆర్‌ విభాగం వాళ్లు పర్యవేక్షిస్తుంటారు. నకిలీ వేలిముద్రలతో పాటు, ఫోటోలు, వీడియోలతో నకిలీ హాజరువేస్తే ఏఐ సాప్ట్‌వేర్ ఇట్టే పసిగట్టేస్తుంది. అలాంటి సేవలనే అందిస్తోందని టీహబ్​కు చెందిన స్ప్రైప్లీ సాప్ట్‌వేర్ కంపెనీ.

ఆకట్టుకున్న మూసీ సుందరీకరణ నమూనా :హైదరాబాద్‌ను ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో మూసీ సుందరీకరణకు రాష్ట్రప్రభుత్వం నడుం బిగించింది. మురికికూపంగా మారిన మూసీ ప్రక్షాళన ఓ సవాల్. సీబీఐటీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిలు రూపొందించిన మూసీ సుందరీకరణ నమూనా ఏఐ సదస్సులో ఆకట్టుకుంటోంది. మూసీచుట్టూ ఎక్కడెక్కడ ఆకాశ హర్మ్యాలు నిర్మించాలి, ఉద్యాన వనాలతో మరింత సుందరంగా ఎలా తీర్చిదిద్దొచ్చనే అంశంతో నమూనా ఏర్పాటు చేశారు.

ఏఐ ఆధారిత డ్రైవర్​లెస్ వాహనం :డ్రైవర్ లేకుండా వాహనం ముందుకు వెళ్లడం కష్టమే. కానీ ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన బృందం డ్రైవర్‌ లేని వాహనాన్ని ఏర్పాటు చేసింది. సెన్సార్ల ద్వారా పరిసరాలన్నింటిని కృత్రిమ మేధతో అంచనా వేసి వాహనం ముందుకెళ్తోంది. చెరువుల ఆక్రమణ గుర్తింపు, పంటల దిగుబడి పెంచడానికి రూపొందించిన ఏఐ ఆధారిత అప్లికేషన్లు సదస్సులో ఏర్పాటు చేశారు.

పరిశ్రమల ఉత్పత్తులు పెరిగి వృథా అరికట్టేలా, పలు రోగాలు, శస్త్ర చికిత్సలు సులభంగా చేసేలా, విద్యార్థుల ప్రతిభకు అనుగుణంగా బోధించేలా ఏఐ ఆధారిత అప్లికేషన్‌లు, వెబ్‌సైట్‌లు అంతర్జాతీయ కృత్రిమ మేథ సదస్సులో కొలువుదీరాయి. పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, యువత, ఇంజనీరింగ్ విద్యార్థులు ఆ స్టాళ్లను ఎంతో ఆసక్తిగా తిలకించారు.

హైదరాబాద్ వేదికగా ఏఐ సదస్సు - అందరికీ అందుబాటులోకి 'AI' నినాదంతో గ్లోబల్‌ సమ్మిట్‌ - AI Global Summit in Hyderabad

ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది వేశాం: సీఎం - CM Revanth Reddy On AI

ABOUT THE AUTHOR

...view details