ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాగునీటి సంఘాల ఎన్నికలకు వేళాయె - మూడంచెలుగా నిర్వహణ - IRRIGATION ASSOCIATION ELECTIONS

ఈ నెల 14 నుంచి సాగునీటి సంఘాల ఎన్నికలు - చివరి ఎకరానికి సైతం సాగునీరు అందజేయాలనే లక్ష్యంతో సాగునీటి సంఘాల పునరుద్ధరణ

irrigation_association_elections
irrigation_association_elections (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 5, 2024, 7:21 PM IST

Irrigation Association Elections : సాగునీటి సంఘాల ఎన్నికలకు వేళయింది. ఈ నెల 14 నుంచి సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ వ్యవసాయం, రైతాంగమే రాష్ట్రానికి ప్రాణం అనే ఉద్దేశంతో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి, చివరి ఎకరం వరకూ సాగు నీరు అందజేయాలనే లక్ష్యంతో సాగునీటి సంఘాలను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

మూడు అంచెల్లో ఎన్నికలు జరుగుతాయని, తొలి రోజు సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులను, రెండో రోజు డిస్ట్రిబ్యూషన్ కమిటీ, మూడో రోజు ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు ఉంటాయని వెల్లడించారు. సేవా దృక్పథంతో పనిచేసే వ్యక్తులు ఈ సంఘాలకు ప్రతినిధులుగా ఉండటం ఎంతో అవసరమని, అటువంటి ఎన్నికల్లో ఎటువంటి వర్గ, పార్టీ పోరు లేకుండా సాధ్యమైనంత మేర ఏకగ్రీవంగా ప్రతి నిధులను ఎన్నుకోవాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. దేశానికి వెన్నెముక అయిన రైతాంగం సంక్షేమాన్ని కాంక్షిస్తూ 2015 లో తమ ప్రభుత్వం సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసిందని చెప్తూ ఎన్నికల ద్వారా ప్రతి నిధులను ఎన్నుకున్నారని అన్నారు.

పోలవరం ఎత్తును తగ్గించే ప్రసక్తే లేదు : మంత్రి నిమ్మల

గత ప్రభుత్వం సాగునీటి సంఘాలను, వాటి విలువను గుర్తించకుండా 2020లో రద్దు చేయడం విచారకరమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రైతులు, వ్యవసాయం పై గత ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్య ధోరణికి ఇది నిదర్శనం అని తెలిపారు. గత ప్రభుత్వం సాగు నీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణకు ఎటు వంటి నిధులు విడుదల చేయకుండా ప్రాజెక్టులను అన్నింటినీ గాలికి వదిలేసిందని మంత్రి ఆరోపించారు.

ఫలితంగా గుండ్లకమ్మ, పులిచింతల, అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకు పోయాయని, ఈ మధ్య రైవస్ కెనాల్ గేటు కూడా కొట్టుకుపోయిందని తెలిపారు. లాకులు షట్టర్లు, డోర్స్, రోప్స్ వంటి వాటికి మరమ్మతుల మాట అటుంచి కనీసం గ్రీజు వంటి మెయింటనెన్స్ కూడా లేదని మంత్రి మండిపడ్డారు. అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకే తమ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి నిమ్మల తెలిపారు.

రెండో వారంలో పోలవరానికి సీఎం చంద్రబాబు - పనుల షెడ్యూల్​ ప్రకటన

జగన్ స్వలాభం కోసం పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు: మంత్రి నిమ్మల

ABOUT THE AUTHOR

...view details