Huge Devotees To Srisailam Mallanna Swamy Temple : సంక్రాంతి పండుగకు మూడు రోజులు వరస సెలవులు రావడంతో దేవాలయాన్ని కిక్కిరిసిపోయాయి. ఫలితంగా ఏ దేవాలయంలో చూసిన భక్తుల రద్దీ కనిపించింది. కుటుంబ సభ్యులతో వచ్చి దేవుళ్లను దర్శించుకుంటున్నారు. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం భక్తుల రద్దీ పెరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు మల్లన్న సన్నిధికి తరలి వచ్చారు. కంపార్ట్మెంట్లన్ని నిండిపోయాయి. రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక సేవలు నిలిపివేశారు. సర్వ దర్శనానికి సుమారు 7గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లలోని భక్తులకు ఆహారం, మంచినీరు అందిస్తున్నారు.
ఇంద్రకీలాద్రిపై ముగిసిన భవానీదీక్ష విరమణలు - ఈ నెల 28 నుంచి ఆర్జిత సేవలు
తగ్గిన రద్దీ : సంక్రాంతి పండుగ రోజు తిరుమల శ్రీవారిని 78వేల మంది భక్తులు దర్శించుకున్నారు. 17,406 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా పండుగ రోజు హుండీ ఆదాయం రూ.3.44 కోట్లు. తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది.