ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టీటీడీలో అక్రమాలపై విచారణ - నిధుల వినియోగంపై లెక్కలు తీస్తున్న విజిలెన్స్‌ విభాగం - Enquiry on Irregularities in TTD

Enquiry on Irregularities in TTD in YSRCP Government: వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన అక్రమాలపై తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. ఇంజనీరింగ్‍ విభాగంలో చేపట్టిన నిర్మాణాలు, శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగం, వీఐపీ టికెట్ల కేటాయింపులో అవకతవకలపై విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. టీటీడీని ప్రక్షాళన చేస్తామన్న సీఎం చంద్రబాబు ప్రకటనలకు అనుగుణంగా చర్యలు ప్రారంభించారు.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 28, 2024, 9:09 AM IST

Enquiry on Irregularities in TTD in YSRCP Government
Enquiry on Irregularities in TTD in YSRCP Government (ETV Bharat)

Enquiry on Irregularities in TTD in YSRCP Government :గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో చోటు చేసుకున్న అక్రమాలపై టీటీడీ చర్యలు చేపట్టింది. ఇంజనీరింగ్‍ విభాగంలో చేపట్టిన నిర్మాణాలు, శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగం, వీఐపీ టికెట్ల కేటాయింపులో అవకతవకలపై విజిలెన్స్ అధికారులు పూర్తి స్ధాయి విచారణ చేపట్టారు. టీటీడీని ప్రక్షాళన చేస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటనలకు అనుగుణంగా అధికారులు చర్యలు ప్రారంభించారు.

విచారణ ప్రారంభం : ప్రక్షాళన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రారంభిస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో టీటీడీలో చర్యలు చేపట్టింది. రాష్ట్ర విజిలెన్స్ విభాగం అధికారులు గోప్యంగా దస్త్రాల పరిశీలన సాగిస్తున్నారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో టీటీడీలో చోటు చేసుకున్న అక్రమాలపై రాష్ట్ర విజిలెన్స్ విభాగం విచారణ ప్రారంభించింది. టీటీడీలోని ఐదు అంశాలపై అక్రమాలు నిగ్గు తెల్చేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.

తిరుమలలో పాతపద్ధతులన్నీ పునరుద్ధరణ - ఐదేళ్లు వైఎస్సార్సీపీ అసమర్థ విధానాలతో భక్తులకు ఇక్కట్లు - TTD FACILITIES IMPROVE IN TIRUMALA

నిధుల వివరాలు సేకరణ : ఆర్జిత సేవ, వీఐపీ బ్రేక్‍ దర్శన టికెట్ల కేటాయింపు, ఇంజనీరింగ్‍ విభాగంలో వందల కోట్ల రూపాయల నిధుల వ్యయం, శ్రీవాణి ట్రస్టు టికెట్ల అమ్మకాలు, తిరుమలలో వసతి గృహల ఆధునికీకరణపై రాష్ట్ర విజిలెన్స్ విభాగం దృష్టి సారించింది. శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శన టికెట్లు కేటాయించి సమకూరిన నిధుల వినియోగంపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్దరణ పనులపై ఆరా తీస్తున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో తిరుమలలో భక్తుల వసతి గృహల ఆధునికీకరణ పేరుతో కోట్ల రూపాయల నిధులు వ్యయం చేయడంపైనా విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. వరాహస్వామి అతిథి గృహం, నారాయణగిరి వసతి గృహలతో పాటు సాధారణ భక్తులకు కేటాయించే వసతి గృహల ఆధునికీకరణ కోసం కేటాయించిన నిధుల వివరాలను సేకరిస్తున్నారు.

తిరుమల లడ్డూ ధరలు తగ్గాయా? వాస్తవమేంటీ? - ttd clarity on Tirupati Laddu Cost

అక్రమాలను గుర్తించే దిశగా చర్యలు :మరోవైపు తిరుపతిలో గోవిందరాజస్వామి సత్రాలను కూల్చి వేసి 460 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణాలు చేపట్టిన వసతి గృహల టెండర్లు, తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తిరుమలలో డోనేషన్‍ విధానంలో కాటేజీల కేటాయింపులో చోటు చేసుకున్న అక్రమాలను గుర్తించే దిశగా చర్యలు ప్రారంభించారు. నిత్యాన్నదానం, లడ్డు ప్రసాదాల తయారీకి అవసరమైన ముడిసరుకుల కొనుగోలు, తదితర అంశాలపై దస్త్రాలను పరిశీలిస్తున్నారు.

తిరుమల శుచి, శుభ్రత కరవు - కీలక విషయాలు వెల్లడించిన కేంద్ర హోంశాఖ కమిటీ - Food Safety Standards in TTD

ABOUT THE AUTHOR

...view details