తెలంగాణ

telangana

ETV Bharat / state

మాయా లేదు - మంత్రం లేదు - అంతా 'చెకు ముకి' మహిమ - CHEKUMUKI SCIENCE FESTIVAL

ఆదిలాబాద్‌ పట్టణంలో ఆకట్టుకున్న సైన్స్‌ కార్నివాల్‌ - రాష్ట్రంలోని 33 జిల్లాల విద్యార్థుల హాజరు - జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సంబురాలు

State Level Chekumuki science Festival :
State Level Chekumuki science Festival : (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Updated : 5 hours ago

State Level Chekumuki science Festival : నేలకు ఆనకుండా గాలిలో కూర్చోవటం ఎలా? ఇసుకలో నీళ్లను పోసి దీపం వెలిగించటం ఎలా? ముళ్ల కంచెపై నిలబడటం, అంతులేని లోతైన నీళ్ల బావి ఇవన్నీ మాయనా? మంత్రమా? కాదు కాదు అంతా సైన్స్‌ అని నిరూపించిన సైన్స్‌ కార్నివాల్‌ విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థులనే కాదు ప్రజల్లో ఆలోచన శక్తిని రేకెత్తించింది.

చెవిలో నుంచి నీరు : తెలంగాణ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి చెకుముకి సంబురాల్లో భాగంగా ఆదిలాబాద్‌లో నిర్వహించిన సైన్స్‌ కార్నివాల్‌ విశేషంగా ఆకట్టుకుంది. ఆదివారం రాత్రి ఎన్టీఆర్‌ చౌక్‌ నుంచి వినాయక చౌక్‌ వరకు నిర్వహించిన సైన్స్‌ కార్నివాల్‌కు అనూహ్య స్పందన లభించింది. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు, సీసీఎంబీ సహా వివిధ విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు పాల్గొన్న ఈ ప్రదర్శనలను ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాజార్షీషా, మాజీ మంత్రి జోగు రామన్న, డీసీసీబీ ఛైర్మన్‌ భోజారెడ్డి ప్రారంభించారు. ఇన్ఫినిటీ వెల్‌, భీష్మ అంపశయ్య వేడినూనె నుంచి చేతితో మిర్చీ బజ్జీలు తీయటం విద్యార్థి తాగిన నీళ్లను చెవి నుంచి తీయటం ఇలా ఎన్నో అబ్బురపరిచే వింతలు, విశేషాలతో కూడిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

"సైన్స్ పైన అవగాహన పెరిగితే ఇలాంటివి చాలా చేస్తారు. అందరూ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. భవిష్యత్తులో మంత్రాలు ఉండవు. కేవలం సైన్స్ మాత్రమే ఉంటుంది. పిల్లలు ఈ మధ్య కాలంలో ఫోన్లు ఉపయోగిస్తున్నాము. వారికి ఇప్పటి నుంచే చెప్పాలి. సైన్స్‌ పాటలు నేర్చుకోవాలి, చదవాలి విద్యార్థులు. ఫోన్స్‌ వాడకం తగ్గించాలి. భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోవాలి." రాజార్షీషా కలెక్టర్‌, ఆదిలాబాద్‌

పటిష్ణమైన బెదోబస్తు : నడుస్తున్న చరిత్రలో సైన్స్‌ తప్పితే మంత్రాలు లేవని జిల్లా కలెక్టర్‌ రాజార్షీషా పేర్కొన్నారు. నేటి తరం విద్యార్థులు మొబైల్‌ ఫోన్లలో సమయాన్ని గడపకుండా సృజనాత్మకతను పెంచుకోవాలని సూచించారు. కార్నివాల్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం పటిష్టమైన బందోస్తు ఏర్పాటు చేసింది.

హైదరాబాద్‌లో పెట్టుబడుల విస్తరణకు అమెజాన్‌ సంస్థ సుముఖత - amazon investments in Hyderabad

YUVA : ఏఐ, డేటా సైన్స్‌ అంశాలపై పట్టుసాధించిన యువతి - ఏడాదికి రూ.34 లక్షల ప్యాకేజీతో కొలువు - Young Woman Got Rs 34 Lakhs Package

వేసవి సెలవులు విజ్ఞాన శిబిరాలు - ఆలోచనలను, సృజనాత్మకతను వెలికి తీసేలా శిక్షణ - Summer Camp in mancherial

Last Updated : 5 hours ago

ABOUT THE AUTHOR

...view details