Govt Released Funds For Musi Oustees :మూసీ నది పునర్జీవనంలో భాగంగా నది గర్భంలో నివసిస్తున్న నిర్వాసితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇప్పటికే కొంతమందిని నదీగర్భం నుంచి తరలించి సమీపంలోని డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించింది. అయితే వారి తరలింపు ప్రక్రియకు సంబంధించి నిర్వాసితులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా నిధులను విడుదల చేసింది. నిర్వాసితుల తరలింపునకు అయ్యే రవాణా ఖర్చుల నిమిత్తం 35 కోట్ల 50 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఒక్కో కుటుంబానికి రూ.25వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయం :నది గర్భంలో నివసిస్తున్న 15 వేల కుటుంబాల తరలింపునకు ఒక్కో కుటుంబానికి 25 వేల రూపాయల చొప్పున రవాణా ఖర్చులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా వివరాలను ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్లు అర్హులైన నిర్వాసితులను గుర్తించి వారికి ఆ సాయం అందించాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది